మూవీ రివ్యూ: క
నటీనటులు : కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వి రామ్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, రాడిన్ కింగ్ స్లే తదితరులు
సంగీతం: సామ్ సీఎస్
సినిమాటోగ్రఫీ: సతీష్ రెడ్డి మసాన్, డేనియల్ విశ్వాస్
ఎడిటర్: శ్రీ వరప్రసాద్
నిర్మాత: చింతా గోపాల్ కృష్ణ రెడ్డి
దర్శకులు: సందీప్, సుజిత్
క సినిమా బాగోలేదని చెప్తే నేను సినిమాలు మానేస్తా.. ఈ సినిమాపై ఎంత నమ్మకం లేకపోతే హీరో కిరణ్ అబ్బవరం ఇలాంటి స్టేట్‌మెంట్ ఇస్తాడు చెప్పండి..? మరి నిజంగానే క సినిమా అంత బాగుందా..? అసలు ఈ సినిమా కథ ఎలా ఉంది..? స్క్రీన్ ప్లే నెక్ట్స్ లెవల్ అన్నారు కదా.. మరి అలాగే ఉందా..? ఇవన్నీ డీటైల్డ్ రివ్యూలో చూద్దాం..
కథ:
అభినయ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) ఓ అనాథ. చిన్నప్పుడే ఓ అనాథాశ్రమం నుంచి డబ్బు దొంగతనం చేసి పారిపోతాడు. ఆ తర్వాత పెద్దయ్యాక కృష్ణగిరి అనే ఊళ్ళోకి పోస్ట్ మ్యాన్‌గా చేరతాడు. చిన్నప్పటి నుంచి లెటర్స్ చదివే అలవాటు ఉంటుంది వాసుదేవ్‌కు. అందుకే పోస్ట్ మ్యాన్ అవుతాడు. అలా చదివిన ఉత్తరాలతోనే కనెక్ట్ అయిపోయి.. ఊరంతా తనవాళ్లే అనుకుంటాడు. కృష్ణగిరిలో పోస్ట్ మాస్టర్ రంగారావు (అచ్యుత్ కుమార్) దగ్గర పనిలో చేరతాడు. అతడి కూతురు సత్యభామ (నయన్ సారిక)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అలా సాగిపోతున్న వాసుదేవ్ జీవితంలో అనుకోని సంఘటనలు జరుగుతాయి. అతడితో పాటు రాధ (తన్వి రామ్) అనే అమ్మాయిని కలిపి ఓ ముసుగు వేసుకున్న వ్యక్తి కిడ్నాప్ చేస్తారు.. ఓ రూమ్‌లో బంధించి కొన్ని ప్రశ్నలు అడుగుతుంటారు. వాటికి సమాధానం చెప్తుంటారు వాసుదేవ్. అదే సమయంలో ఊళ్ళో నుంచి కొందరు అమ్మాయిలు మాయమైపోతుంటారు. ఓ సారి సత్యభామను కూడా కిడ్నాప్ చేయాలని ప్రయత్నిస్తే అడ్డు పడతాడు వాసుదేవ్. అక్కడ్నుంచి తీగ లాగితే డొంకంతా కదిలినట్లు.. అసలు వెనక ఏం జరుగుతుందనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది..? అసలు వాసుదేవ్‌ను కిడ్నాప్ చేసిందెవరు..? అనేది మిగిలిన కథ..
కథనం:
మొదటి నుంచి మెల్లగా ఆడి చివరి బాల్ సిక్స్ కొట్టి గెలిపిస్తే ఆ కిక్కు వేరు. క సినిమా విషయంలో కిరణ్ అబ్బవరం ఇదే చేశాడేమో అనిపించింది. చివరి 20 నిమిషాలు సినిమాకు ప్రాణం. దాని కోసం సినిమా అంతా చూడొచ్చు అంటే. మీరే అర్థం చేసుకోండి క్లైమాక్స్ ఏ రేంజ్ లో ఉందో.. అప్పటి వరకు సినిమా చాలా నెమ్మదిగా సాగుతుంది. ఇది మనం చూడని కథ కాదు.. కానీ స్క్రీన్ ప్లే మాత్రం నెక్స్ట్ లెవెల్. చాలా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే రాసుకున్నారు దర్శక ద్వయం సుజిత్-సందీప్. కాకపోతే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా క్లైమాక్స్ మీద ఉంది. ముందు నుంచి కూడా ఉంటే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉండుంటే సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండేది. ఆసక్తికరంగా మొదలైంది.. మధ్యలో కాస్త స్లో అయింది. ఇంటర్వెల్ ట్విస్ట్ తో సెకండ్ హాఫ్ కు పర్ఫెక్ట్ గా గ్రౌండ్ సెట్ అయింది. సెకండ్ ఆఫ్ నెమ్మదిగా మొదలైంది.. కాకపోతే కొత్తగా అయితే అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి అసలు మ్యాజిక్ మొదలైంది. అప్పటి వరకు వేసిన చిక్కుముడులు ఆ 15 నిమిషాలలో విప్పేసాడు దర్శకులు. స్టోరీ రొటీన్.. స్క్రీన్ ప్లే దాన్ని కొత్తగా మార్చేసింది. ఇందులో చాలా ట్విస్టులు ఉన్నాయి కాబట్టి మెయిన్ స్టోరీ చెప్పడం సరికాదు. ఒక్క చిన్న ముక్క చెప్పినా అసలు మ్యాటర్ రివీల్ అవుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ కోసం ఈ సినిమా చూడొచ్చు అనేది మాత్రం కాదనలేని నిజం. అప్పటి వరకు సినిమాను భరిస్తే.. థియేటర్ నుంచి బయటికి వచ్చేటప్పుడు కచ్చితంగా వావ్ ఫీలింగ్‌తో వస్తారు.
నటీనటులు:
కిరణ్ అబ్బవరం ఈ సినిమా కోసం ప్రాణం పెట్టాడు. వాసుదేవ్ పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. నయన్ సారిక అందంగా ఉంది.. తన్వి రామ్ నటనతో మెప్పించింది. కన్నడ నటుడు అచ్యుత్ కుమార్ బాగా నటించాడు. ఇక శరణ్య ప్రదీప్, అన్నపూర్ణమ్మ, అజయ్ తమ తమ పాత్రలకు న్యాయం చేసారు. హీరో ఫ్రెండ్ తమిళ కమెడియన్ కింగ్ స్లే బాగున్నాడు. మిగిలిన వాళ్లంతా ఓకే..
టెక్నికల్ టీం:
క సినిమాకు ప్రాణం సామ్ CS సంగీతం. ప్రతీ సీన్‌ను తన మ్యూజిక్‌తో ఎలివేట్ చేసాడీయన. ముఖ్యంగా జాతర పాట అదిరిపోయింది. ఆర్ఆర్ కూడా చాలా బాగా వర్కవుట్ అయింది. ఇక ఎడిటింగ్ కాస్త వీక్.. ఫస్టాఫ్ స్లోగా అనిపిస్తుంది.. సెకండాఫ్ బాగుంది.. క్లైమాక్స్ అయితే మాటల్లేవు.. జస్ట్ ఎక్స్‌పీరియన్స్ చేయాలంతే. దర్శక ద్వయం సుజీత్, సందీప్ కథ కంటే స్క్రీన్ ప్లేపై ఫోకస్ పెట్టారు. క్లైమాక్స్ అదరగొట్టారు.. ముందు చెప్పినట్లు మిగిలిన సినిమా కూడా అలాగే ఉండుంటే.. కిరణ్ అబ్బవరం చెప్పినట్లు ట్రెండ్ సెట్టర్ అయ్యుండేది క.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా KA.. అంచనల్లేకుండా వెళ్తే క్లైమాక్స్ 20 నిమిషాలు మతి పోగొడుతుంది..
ఇది చదవండి : Tollywood: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు మోడ్రన్‌గా.. చెప్పవే చిరుగాలి హీరోయిన్ను ఇప్పుడు చూస్తే షాకే..
Tollywood: ఫోక్ సాంగ్‌తో ఫేమస్ అయిన వయ్యారి.. హీరోయిన్గా అదరగొట్టేసింది..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.