
టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిన ముద్దుగుమ్మల్లో కీర్తిసురేష్ ఒక రు. టాలీవుడ్ లో నేను శైలజ సినిమాతో పరిచయమైన ఈ భామ చైల్డ్ ఆర్టిస్ట్ గాను పలు సినిమాల్లో నటించి మెప్పించింది. కీర్తిసురేష్ హీరోయిన్ గా తమిళ్ సినిమాతో పరిచయమైనప్పటకి..మలయాళంలో పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. 2015లో వచ్చిన ఇదు ఎన్న మాయం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కీర్తి.. ఆ తర్వాత అదే ఏడాది వచ్చిన నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిన్నది. ఆ తర్వాత మహానటి సినిమాతో పాపులర్ య్యింది. ఈ సినిమాకు ఏకంగా జాతీయ అవార్డు కూడా అందుకుంది. ఇక ఇప్పుడు తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
కీర్తి ఇటీవలే పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.. అయితే రీసెంట్ గా బాలీవుడ్ లోనూ సినిమా చేసింది కీర్తి. బేబీ జాన్ అనే సినిమాతో అక్కడ పరిచయం అయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇక ఇప్పుడు వరుస సినిమాతో బిజీ కానుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సూర్య నటిస్తున్న సినిమా ఆఫర్ ను కీర్తి రిజెక్ట్ చేసిందని టాక్ వినిపిస్తుంది. టాలీవుడ్ హీరో సినిమా కోసం కీర్తి సూర్య సినిమా ఆఫర్ కు నో చెప్పిందని అంటున్నారు. ఆ హీరో ఎవరో కాదు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా, కీర్తిసురేష్ హీరోయిన్ గా ఓ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తుంది. అలాగే సూర్య హీరోగా నటిస్తున్న 46 సినిమాలోనూ ఛాన్స్ అందుకుందట. అయితే విజయ్ దేవరకొండ సినిమా కారణంగా కీర్తిసురేష్ సూర్య సినిమాకు నో చెప్పిందని తెలుస్తుంది. గతంలో సూర్య , కీర్తి కాంబినేషన్ లో గ్యాంగ్ అనే సినిమాలో నటించారు. కానీ ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సూర్య ఇప్పుడు తన 46వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అనేది తెలియాల్సి ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.