Aishwarya Rai: చిన్నపిల్లకు సర్జరీ చేయిస్తావా..! ఐశ్వర్య రాయ్ పై నెటిజన్స్ ట్రోల్స్..
అందాల తార ఐశ్వర్య రాయ్ కూతురు ఆరాధ్య బచ్చన్ గురించి ఈ మధ్యకాలంలో చాలా రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిన్నదాని ఫోటోలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం చదువుకుంటున్న ఈ స్టార్ కిడ్ తరచూ తన తల్లితో కలిసి ఈవెంట్స్ కు, ఫంక్షన్స్ కు హాజరవుతోంది.

ప్రస్తుతం బాలీవుడ్ లో ఉన్న ది మోస్ట్ రొమాంటిక్ కపుల్స్ లో ఐశ్వర్య, అభిషేక్ జంట ఒకటి. వీరి వైవాహిక జీవితం గురించి ఎన్నో రూమర్లు నడుస్తున్నా ఇప్పటికీ వీరిని ది బెస్ట్ కపుల్ గానే పరిగణిస్తారు. ఐశ్వర్య, అభిషేక్ 2007 లో వివాహం చేసుకున్నారు. వివాహం జరిగిన నాలుగు సంవత్సరాల తర్వాత అంటే 2011 లో ఐశ్వర్యకు ఆరాధ్య జన్మించింది. ప్రస్తుతం ఈ స్టార్ కిడ్ ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుతోంది. స్టడీ పరంగా ఆరాధ్య చాలా చురుకైన విద్యార్థిని. పాఠశాలలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తోంది.
ప్రస్తుతం చదువుకుంటున్న ఈ స్టార్ కిడ్ తరచూ తన తల్లితో కలిసి ఈవెంట్స్ కు, ఫంక్షన్స్ కు హాజరవుతోంది. రీసెంట్ గా ఐశ్వర్య, ఆరాధ్య కు సంబంధించిన ఓ వీడియో వైరల్ చూడటానికి ముద్దుగా ఉన్న ఆరాధ్య బచ్చన్ పై కొందరు కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఆమెకు తల్లి ఐశ్వర్య సర్జరీ చేయించిందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆరాధ్య అందంగా కనిపించడానికి కారణం సర్జరీ చేయించుకుందని ఓ పుకారు నెట్టింట షికారు చేస్తుంది. అయితే ఈ వార్త అటు బాలీవుడ్ ను షేక్ చేస్తుంది.
ఐశ్వర్య రాయ్ తన కూతురు ఆరాధ్యకు సర్జరీ చేయించిందనే వార్త వైరల్ అవ్వడంతో నెటిజన్స్ ఐష్ ను ఏకిపారేస్తున్నారు. ఆరాధ్య వయసు కేవలం 13 ఏళ్ళు మాత్రమే.. ఇంత చిన్న వయసులో ఆమెకు సర్జరీ చేయించడం అవసరమా అంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. కొంతమంది నెటిజన్స్ మాత్రం ఐష్ కూతురు చాలా అందంగా ఉంది. త్వరలోనే హీరోయిన్ అయ్యే అవకాశం ఉంది ఆంట్ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా చిన్నవయసులోనే ఆరాధ్య సర్జరీ చేయించుకుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








