చెత్తగా నటించావ్.. హీరోయిన్ మొఖంమీదే తిట్టేసిన డైరెక్టర్.. కట్ చేస్తే ఆమె ఇప్పుడు ఇలా
సినిమా ఇండస్ట్రీలో నటినటీలుగా గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభమేమి కాదు. ఎంతో మంది అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరగడం.. ఎన్నో అవమానాలు ఎదుర్కొని చివరకు తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్స్ చాలా మంది ఉన్నారు. వారిలో ఈ అమ్మడు ఒకరు.

సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్స్ గా రాణించాలని ఎంటర్ అవుతూ ఉంటారు. కొంతమంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. సినిమాల్లో రాణిస్తున్నారు. కొంతమంది మాత్రం కొన్ని సినిమాలకే పరిమితం అవుతూ కనిపించకండా మాయం అవుతుంటారు. మరికొంతమంది కానీ కెరీర్ ప్రారంభంలోనే అనేక విమర్శలు ఎదుర్కొని.. కష్టాలను, అడ్డంకులను దాటుకుని తమకంటూ మంచి ఇమేజ్ సంపాదించుకుంటారు. ప్రస్తుతం స్టార్ హీరోహీరోయిన్లుగా రాణిస్తున్న తారలు ఎప్పుడో ఒకసారి.. ఏదోక సందర్భంలో విమర్శలు తీసుకున్నవారే.. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ కూడా వారిలో ఒకరే.. చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అమ్మడు.
ఆమె ఎవరో కాదు హీరోయిన్ కీర్తి సురేష్.. కెరీర్ తొలినాళ్లల్లో ఒక దర్శకుడు తనను అందరి ముందు తిట్టడంతో ఏడ్చేశానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఈ అందాల తార. ప్రస్తుతం కీర్తిసురేష్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ ఆసక్తికర విషయాలు పంచుకుంది. కీర్తి సురేశ్ మాట్లాడుతూ.. “గీతాంజలి సినిమాతో మలయాళంలో నా సినీప్రయాణం స్టార్ట్ అయ్యింది. ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. అప్పుడు జరిగిన ఓ సంఘటన నాకు ఇంకా బాగా గుర్తుంది. ఓ సన్నివేశం షూటింగ్ అయ్యాక.. ఎంత చెత్తగా చేశావో తెలుసా.. ? వెళ్లి మానిటర్ చూసుకోపో అని తిట్టారు. నాకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నాకు అది మొదటి సినిమా కావడంతో ఏడ్చేశాను. ఆయన అందరిని అలాగే అనేస్తాడు. ఆయన కూతురు కళ్యాణి ప్రియదర్శన్ ను సైతం అలాగే తిట్టేవారు” అంటూ చెప్పుకొచ్చారు.
గీతాంజలి సినిమాతో నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన కీర్తి సురేష్.. తెలుగులో అత్యధిక చిత్రాల్లో నటించారు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఈ అమ్మడు విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా ఓ సినిమా చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు రెగ్యులర్ గా ఫోటోలు.. వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.
View this post on Instagram




