RRRMovie : కొమ్మ ఉయ్యాల.. కోన జంపాల పాట ఆలపించిన చిన్నారికి ఫిదా అయిన కీరవాణి.. టాలెంటెడ్ కిడ్ అంటూ..

'ఆర్ఆర్ఆర్' సినిమా ఎంత ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ సినిమా భారీ వసూళ్ల దిశగా పరుగులు తీస్తుంది.

RRRMovie : కొమ్మ ఉయ్యాల.. కోన జంపాల పాట ఆలపించిన చిన్నారికి ఫిదా అయిన కీరవాణి.. టాలెంటెడ్ కిడ్ అంటూ..
Rrr
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 05, 2022 | 8:08 AM

ఆర్ఆర్ఆర్(RRR Movie) సినిమా ఎంత ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ సినిమా భారీ వసూళ్ల దిశగా పరుగులు తీస్తుంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ ఇండియా లెవల్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. విడుదలైన అన్ని భాషల్లో భారీ వసూళ్లను రాబడుతుంది ఆర్ఆర్ఆర్. ఇక ఈ సినిమాలో చాలా విశేషాలు ఉన్నాయి. కొమురం భీమ్‌గా తారక్, అల్లూరిగా చరణ్ తమ నటనలతో ప్రేక్షకులను కట్టి పడేశారు. ఇక జక్కన్న మేకింగ్ సినిమా స్థాయిని పెంచేసింది. విజువల్స్ పరంగాను ఆర్ఆర్ఆర్ ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించాయి. అలాగే ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ సంగీత దర్శకుడు కీరవాణి(Keeravani). అద్భుతమైన బాణీలను ఈ సినిమా కోసం అందించారు కీరవాణి. ఆర్ఆర్ఆర్ సినిమాలోని అన్ని పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.

ఆర్ఆర్ఆర్ సినిమా ఓ చిన్న పాటతో మొదలవుతుంది. కొమ్మ ఉయ్యాల.. కోన జంపాల పాటతో సినిమా ఆరంభం అవుతుంది. ఓ చిన్నారి ఈ పాటను ఆలపిస్తూ బ్రిటీష్ రాణికి పచ్చబొట్టు వేస్తూ కనిపిస్తుంది. ఈ చిన్న పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ పాట పాడిన చిన్నారిని కీరవాణి పరిచయం చేశారు. ఈ అందమైన గీతాన్ని ఆలపించిన చిన్నారి పేరు ప్రకృతి.. మార్చి 15న 2019లో ఈ పాటను రికార్డ్ చేశారు కీరవాణి. అప్పుడు ఆ చిన్నారి వయసు మూడేళ్లు. ఎంతో అందంగా స్పష్టంగా ప్రకృతి కొమ్మ ఉయ్యాల పాటను ఆలపించింది. ఇందుకు సంబంధించిన వీడియోను కీరవాణి సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Photo: చక్కనైన కళ్లు.. బూరెబుగ్గలు.. ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు యూత్ ఐకాన్..

Arabic Kuthu: యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న ‘అరబిక్ కుతు’ సాంగ్ తెలుగు వెర్షన్.. ఇంతకీ మీరూ విన్నారా ?..

Sarkaru Vaari Paata: మహేష్ బాబు ఫ్యాన్స్‏కు మళ్లి నిరాశేనా !.. సర్కారు వారి పాట వాయిదా ?.. ఇప్పుడిదే హాట్ టాపిక్..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!