Catherine Tresa: లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన కేథరిన్‌.. మాస్‌ మహారాజాకు జోడిగా.?

Catherine Tresa: కన్నడ సినిమా శంకర్‌ ఐపీఎస్‌తో వెండి తెరకు పరిచయమైంది అందాల తార కేథరిన్‌ థెరిసా. ఇక 2013లో వచ్చిన చమ్మక్‌ చల్లో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పలకరించిందీ బ్యూటీ...

Catherine Tresa: లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన కేథరిన్‌.. మాస్‌ మహారాజాకు జోడిగా.?
Catherine Tresa
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 07, 2022 | 8:53 AM

Catherine Tresa: కన్నడ సినిమా శంకర్‌ ఐపీఎస్‌తో వెండి తెరకు పరిచయమైంది అందాల తార కేథరిన్‌ థెరిసా. ఇక 2013లో వచ్చిన చమ్మక్‌ చల్లో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పలకరించిందీ బ్యూటీ. ఈ సినిమా కేథరిన్‌కు పెద్దగా పేరు తెచ్చిపెట్టకపోయినప్పటికీ, ఆ తర్వాల అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా వచ్చిన ‘ఇద్దరమ్మాయిలతో’ ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఈ సినిమాలో తనదైన నటన, అందంతో ఆకట్టుకుందీ ముద్దుగుమ్మ. ఆ తర్వాత తెలుగుతో పాటు, తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించిన ఈ చిన్నది 2020లో వచ్చిన ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ సినిమా తర్వాత మళ్లీ వెండి తెరపై కనిపించలేదు. అయితే తాజాగా బింబిసార’ ‘మాచర్ల నియోజకవర్గం’ వంటి వరుస చిత్రాలతో టాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమైంది.

ఈ నేపథ్యంలో కేథరిన్‌ మరో మంచి అవకాశాన్ని సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాబీ దర్శకత్వంలో చిరంజీవి 154వ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చిరుకి జోడిగా శృతీ హాసన్‌ నటిస్తుండగా, మాస్‌ మహారాజ రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నారు. దీంతో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లక ముందే అందరి దృష్టిని ఆకర్షించింది. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రవితేజ జోడీగా కేథరిన్‌ నటించనుందని తెలుస్తోంది.

ఇప్పటికే చిత్ర యూనిట్‌ కేథరిన్‌ను సంప్రదించగా ఓకే చెప్పేసిందని తెలుస్తోంది. పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ చిరు, రవితేజలాంటి స్టార్‌ హీరోల చిత్రంలో నటించే అవకాశం రాగానే కేథరిన్‌ వెంటనే గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చిందని టాక్‌ నడుస్తోంది. ఈ విషయమై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Also Read: Viral Photo: చక్కనైన కళ్లు.. బూరెబుగ్గలు.. ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు యూత్ ఐకాన్..

Health Tips: అధిక బరువుతో బాధపడుతున్నారా.. పెరుగుతో కలిపి వీటిని తీసుకోండి.. ఆశ్చర్యపోయే ఫలితాలు..

Minister Perni Nani: సొంత నియోజకవర్గానికి రెవెన్యూ డివిజన్ తెచ్చుకోలేకపోయాడు.. చంద్రబాబుపై సెటైర్లు..