Harnaaz Sandhu: శిల్పాశెట్టిపై మండిపడుతోన్న నెటిజన్లు.. ఆమెకు సంస్కారం లేదంటూ కామెంట్స్.. కారణమేంటంటే..
Miss Universe Harnaaz Sandhu: గతేడాది ఇజ్రాయెల్ వేదికగా జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో విజేతగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది హర్నాజ్ సంధూ కౌర్. పోటీలకు ముందు ఎలాంటి అంచనాలు లేని ఈ పంజాబీ మోడల్

Miss Universe Harnaaz Sandhu: గతేడాది ఇజ్రాయెల్ వేదికగా జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో విజేతగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది హర్నాజ్ సంధూ కౌర్. పోటీలకు ముందు ఎలాంటి అంచనాలు లేని ఈ పంజాబీ మోడల్ సుమారు రెండు దశాబ్దాల అనంతరం మన దేశానికి విశ్వ సుందరి కిరీటాన్ని తీసుకొచ్చింది. తద్వారా బాలీవుడ్ బ్యూటీ లారా దత్తా తర్వాత ఈ ఘనత సాధించిన మూడో భారతీయురాలిగా హర్నాజ్ సంధూ (Harnaaz Sandhu) గుర్తింపు పొందింది. కాగా మిస్ యూనివర్స్ పోటీల అనంతరం ఓ పంజాబీ సినిమాలో నటించింది ఈ అందాల తార. ఆ తర్వాత కొన్ని రోజుల క్రితం గ్రేటర్ నోయిడాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఐటీబీపీ జవాన్ల కుటుంబ సభ్యులు, వారి పిల్లలతో కలిసి సరదాగా డ్యాన్స్ చేసింది. ఇక లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ వాక్ చేసి మరోసారి టాప్ ఆఫ్ ది టాన్ అయింది. ఈ సందర్భంగా తన శరీరాకృతిపై నెగెటివ్ కామెంట్లు చేసిన వారికి తనదైన శైలిలో సమాధానం చెప్పింది. అదేవిధంగా హిజాబ్‌పై తన అభిప్రాయాలను పంచుకుని వార్తల్లో నిలిచింది. తాజాగా బాలీవుడ్ మోస్ట్ పాపులర్ షో ఇండియాస్ గాట్ టాలెంట్ 9 కు అతిథిగా హాజరైంది. బాలీవుడ్ ఫిట్‌నెస్ ఫ్రీక్ శిల్పా శెట్టి (Shilpa Shetty), సింగర్ బాద్‌షా, మనోజ్ ముంతాషీర్, కిరణ్ ఖేర్ ఈ రియాలిటీ షోకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ షోలో హర్నాజ్ పట్ల శిల్పాశెట్టి, ఇతర జడ్జ్‌లు వ్యవహరించిన తీరుపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.
అంత ఆటిట్యూడ్ అవసరం లేదు..
కాగా ఈ షోలో హర్నాజ్ న్యాయనిర్ణేతలను పలకరించేందుకు వచ్చినప్పుడు శిల్పాశెట్టి తనకేమీ పట్టనట్లు వ్యవహరించింది. మిగతా జడ్జ్‌లతో హర్నాజ్ షేక్ హ్యాండ్ ఇస్తూ మాట్లాడుతుంటే శిల్ప మాత్రం తన చెల్లెలు షమితా శెట్టితో ముచ్చట పెట్టింది. చివరకు గానీ హర్నాజ్‌ను పలకరించలేదు. చివరకు హర్నాజ్ షేక్‌హ్యాండ్ ఇస్తున్నప్పుడు శిల్పా ఎంతో ఆటిట్యూడ్ చూపించింది. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు శిల్పా శెట్టి, సింగర్ బాద్‌షాపై మండిపడుతున్నారు. ‘అతిథులకు ఇచ్చే గౌరవం ఇదేనా’, ‘ఒక మిస్ యూనివర్స్‌తో ఇలాగేనా ప్రవర్తించేది?’, ‘హర్నాజ్ దేశానికి ఎంత మంచి పేరు తీసుకొచ్చింది. ‘అలాంటి అమ్మాయితో ఇంత దారుణంగా వ్యవహరిస్తారా?’ ‘ఈ జడ్జ్‌లకు కనీస గౌరవమర్యాదలు తెలియవు’ అంటూ షో జడ్జ్‌లపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.
View this post on Instagram
View this post on Instagram
Also Read:Oil Test: మీ ఇంట్లో ఉండే వంటనూనె కల్తీదా..? మంచిదా..? చిన్న ప్రయోగంతో తెలుసుకోండి
Viral Photo: ఒక్క ఫోటోతో హృదయాలను కదిలించిన పాప.. నెట్టింట సెన్సేషన్!




