AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: అధిక బరువుతో బాధపడుతున్నారా.. పెరుగుతో కలిపి వీటిని తీసుకోండి.. ఆశ్చర్యపోయే ఫలితాలు..

Flax Seeds With Curd: పెరుగుతున్న బరువుతో ఆందోళన చెందుతున్నారాం.. అయితే, మీ ఆహారంలో పెరుగుతోపాటు వీటిని చేర్చుకోండి. అద్భుత ఫలితాలు పొందుతారు. అవి ఏంటి, ఎప్పుడు, ఎలా తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Health Tips: అధిక బరువుతో బాధపడుతున్నారా.. పెరుగుతో కలిపి వీటిని తీసుకోండి.. ఆశ్చర్యపోయే ఫలితాలు..
Eat Flax Seeds With Curd
Venkata Chari
|

Updated on: Apr 04, 2022 | 9:46 PM

Share

వేసవిలో పెరుగు(Curd) తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఇది మీ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. మంచి బ్యాక్టీరియా అని పిలిచే ప్రోబయోటిక్స్‌ను పెరుగు కలిగి ఉంటుంది. చెడు బాక్టీరియాను తొలగించడంలో ఇది ఎంతో సహాయపడుతుంది. పెరుగు మీ pHని బ్యాలెన్స్ చేస్తుంది. అవిసె గింజల(flax seeds) వల్ల చాలా ప్రయోజనాలు(Health) ఉన్నాయి. ఇందులో మంచి మొత్తంలో పీచు ఉంటుంది. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. కాబట్టి బరువు తగ్గడానికి అవిసె గింజలను ఎలా ఉపయోగించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

బరువు తగ్గడానికి సహాయపడుతుంది- బరువు తగ్గడానికి ప్రోటీన్ ఉన్న మంచి వనరులను తీసుకోవడం ఎంతో అవసరం. అవిసె గింజలు ఇందులో మొదటి స్థానంలో నిలుస్తాయి. 100 గ్రాముల విత్తనాలలో 18 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది కణాలను సరిచేయడానికి, కండరాలను నిర్మించడంలో సహాయపడే ముఖ్యమైన మాక్రోన్యూట్రియెంట్. ఇది మ్యుసిలేజ్ అని పిలువబడే ఫైబర్ కలిగి ఉంటుంది. ఇది ఆకలిని అణచివేయడంలో సహాయపడుతుంది. దీంతో అతిగా తినకుండా సహాయపడుతుంది

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి- అవిసె గింజల్లో ఒమేగా-3 చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అవిసె గింజలు మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఆటో ఇమ్యూన్ వ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు చాలా మేలు చేస్తాయి. దీనితో పాటు, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా ఇది మీకు చాలా సహాయపడుతుంది. ఇందులో ఉండే అధిక ఫైబర్, లిగ్నాన్ కారణంగా ఇది సాధ్యమవుతుంది.

ఫైబర్‌కు మంచి మూలం- అవిసె గింజలు ఫైబర్‌కు మంచి మూలం. మీరు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తిన్నప్పుడు, ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన అనుభూతి చెందుతారు. మీరు బరువు తగ్గడానికి కేలరీలను తగ్గిస్తున్నట్లయితే, ఇది తినాలనే మీ కోరికను అణచివేయడంలో సహాయపడుతుంది. పేగుల ద్వారా ఆహారాన్ని తరలించడానికి ఫైబర్ తినడం చాలా అవసరం. అదనంగా, ఇది రక్తంలో చక్కెరను తగ్గించడంలోనూ సహాయపడుతుంది.

అవిసె గింజలను ఇలా తినండి..

అవిసె గింజలను కాల్చి తినాలి- అవిసె గింజలు రెండు రకాలు. పసుపు, గోధుమ రంగులో ఉంటాయి. ఈ రెండూ పోషకరమైనవే. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మీ ఆహారంలో తీసుకోవాలనుంటే, 2 టీస్పూన్ల అవిసె గింజలను తీసుకోవాలి. అవిసె గింజలను వేయించిన తర్వాత కూడా తినవచ్చు. అలాగే పానీయాలలో, సలాడ్లలో లేదా పెరుగులో కలుపుకుని తినవచ్చు. వేయించిన విత్తనాలను మెత్తగా పొడిగా తయారు చేకోవాలి. ఆ తర్వాత పొడిని గాలి చొరబడని డబ్బాలో భద్రపరుచుకోవాలి. సలాడ్ లేదా స్మూతీలో ఒక చెంచా పొడిని వేసి తినాలి.

అవిసె గింజలను పెరుగుతో కలిపి తినండి- ముందుగా ఒక బాణలిలో రెండు చెంచాల అవిసె గింజలను వేయించి పొడి చేసుకోవాలి. దీని తరువాత, ఒక గిన్నెలో 4 టేబుల్ స్పూన్లు తక్కువ కొవ్వు ఉన్న పెరుగు తీసుకుని, అవిసె గింజల పొడిని వేసి కలపాలి. అప్పుడు దాని పైన తేలికపాటి రాతి ఉప్పు వేసి మీ భోజనంలో చేర్చుకోవాలి.

పండ్లతో అవిసె గింజలను తినండి- 4-5 స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలను కట్ చేసి పక్కన పెట్టండి. అవిసె గింజలను వేయించిన తర్వాత, పొడిని తయారు చేసి, పెరుగుతోపాటు గిన్నెలో ఉంచుకోవాలి. వీటికి తరిగిన స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ వేసి, మిక్స్ చేసి లంచ్ సమయంలో తినండి.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు, చిట్కాలు కేవలం అవగాహన కోసమే. ఇలాంటి వాటిని అనుసరించాలనుకుంటే, ముందుగా డాక్టర్‌ను సంప్రదించడం మంచింది.

Also Read: Health Tips: ముఖంపై వేడి మొటిమలతో ఇబ్బందిపడుతున్నారా.. సింపుల్‌గా ఇలా చేయండి..!

Green Almonds: ఆకుపచ్చ బాదంతో అనేక లాభాలు.. ఈ సమస్యలతో బాధపడేవారికి దివ్య ఔషధం..!