Karthikeya 2: బాలీవుడ్‌లో కార్తికేయ2 భారీ వసూళ్లు.. బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన బిగ్‌బీ

Amitabh Bachchan: యూత్‌ హీరో నిఖిల్‌ (Nikhil), అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) జంటగా నటించిన చిత్రం కార్తికేయ2. 2014లో విడుదలై ఘన విజయం సాధించిన కార్తికేయ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది.

Karthikeya 2: బాలీవుడ్‌లో కార్తికేయ2 భారీ వసూళ్లు.. బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన బిగ్‌బీ
Amitabh Bachchan

Edited By:

Updated on: Aug 20, 2022 | 7:36 PM

Amitabh Bachchan: యూత్‌ హీరో నిఖిల్‌ (Nikhil), అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) జంటగా నటించిన చిత్రం కార్తికేయ2. 2014లో విడుదలై ఘన విజయం సాధించిన కార్తికేయ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. మొదటి భాగానికి దర్శకత్వం వహించిన చందూ మొండేటినే రెండో పార్ట్‌నూ తెరకెక్కించారు. చిన్న బడ్జెట్‌ చిత్రంగా ఆగస్టు 13న విడుదలైన ఈ చిత్రం దుమ్ము రేపుతోంది. మొదటి షో నుంచే పాజిటివ్‌ టాక్‌ రావడంతో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌లోనూ భారీ వసూళ్లు వస్తున్నాయి.ఈ సినిమాలోని హిందుత్వం, శ్రీకృష్ణాసారం వంటి అంశాలు ఉత్తరాది సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మొదటి రోజు హిందీలో కేవలం 50 స్క్రీన్లతో విడుదలైన కార్తికేయ2 ఇప్పుడు ఏకంగా 1000 స్క్రీన్స్‌కి చేరుకుందంటే ఈ సినిమా దక్కుతున్న ఆదరణను అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ఈ సినిమా విజయంలో మంచి ఊపు మీదున్న డైరెక్టర్ చందూ మెుండేటికి అరుదైనఅవకాశం లభించింది. బిగ్​బీ అమితాబ్​ బచ్చన్​ను (Amitabh Bachchan) కలిసే అవకాశం వచ్చింది.

కార్తికేయ చిత్రబృందంపై ప్రశంసల జల్లు కురిపించారు అమితాబ్‌. డైరెక్టర్‌ను స్వయంగా పిలిచి అభినందనలు తెలియజేశారు. ఈవిషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకుని మురిసిపోయాడు చందూ. బిగ్‌బీని కలవడం తన జీవితంలో మర్చిపోలేని సంఘటన అని ఉబ్బితబ్బిబ్బైపోయాడు. ఈ నేపథ్యంలో అమితాబ్‌, చందూ కలిసి దిగిన ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ అవుతోంది. కాగా కార్తికేయ సినిమాలో బాలీవుడ్‌ దిగ్గజ నటుడు అనుపమ్‌ ఖేర్‌ ఓ కీలక పాత్రలో కనిపించి మెప్పించారు. అలాగే శ్రీనివాసరెడ్డి, హర్ష, ప్రవీణ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీకృష్ణుడి జన్మస్థానమైన ద్వారకలో దాగున్న రహస్యాల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..