Karthi : మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న కార్తీ.. 7ఏళ్ల తరవాత ఇప్పుడు తెలుగులోకి..

తమిళ్ స్టార్ హీరో కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన సినిమాలన్నీ తెలుగులోనూ డబ్ అవుతూ ఉంటాయి.

Karthi : మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న కార్తీ.. 7ఏళ్ల తరవాత ఇప్పుడు తెలుగులోకి..
Karthi

Edited By:

Updated on: Aug 24, 2021 | 8:26 AM

Karthi : తమిళ్ స్టార్ హీరో కార్తీకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన సినిమాలన్నీ తెలుగులోనూ డబ్ అవుతూ ఉంటాయి. యుగానికి ఒక్కడు సినిమాతో హీరోగా పరిచయమైన కార్తీ ఆ తర్వాత వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. కెరీర్ మొదటినుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ మంచి విజయాలను తన ఖాతాలోవేసుకుంటున్నాడు కార్తీ. ఇక తెలుగులో ఆవారా, ఖాకీ, ఖైదీ లాంటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న కార్తీ ఇప్పుడు మరి సినిమా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఇది తాజా చిత్రమేమికాదు.. కార్తీ గతంలో నటించిన సినిమాను ఇప్పుడు తెలుగులోకి డబ్ చేసి విడుదల చేయనున్నారు. 2014లో తమిళంలో విడుదలై ఘన విజయం సాధించిన మద్రాస్ సినిమాను ఇప్పుడు  అదే పేరుతో తెలుగులో విడుదల చేయబోతున్నారు.

రంజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను జ్ఞానవేల్ రాజా నిర్మించారు. విమర్శకుల ప్రశంసలే కాదు కమర్షియల్ గానూ విజయం అందుకున్న ఈ సినిమా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి రాబోతుంది. కార్తీ- కలైరసన్ హరికృష్ణన్- కేథరిన్ థ్రెసా- రిత్విక ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు. తెలుగులో కార్తీకి మంచి మార్కెట్ ఉండటంతో ఈ సినిమా ఇక్కడ కూడా మంచి విజయం సాదిస్తుడని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Niharika Konidela: బిగ్ బేబీ బ్రదర్‌తో రాఖీ సెలబ్రేషన్స్ .. ఈ ఫొటోలో ఉంది ఎవరో గుర్తుపట్టండి అంటున్న నిహారిక

Kangana Ranaut Thalaivi: బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ తలైవి మూవీ విడుదలకు డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడంటే..?

Allu Arjun Pooja Hegde: అల్లు అర్జున్, పూజాహెగ్డే కాంబినేషన్ మళ్లీ రిపీట్‌కానుందా..!

Actress Priyanka Pandit: మరో భోజ్‌పురి నటి ప్రైవేటు వీడియో లీక్‌.. సోషల్‌ మీడియాలో వైరల్‌..!