AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suman: సీనియర్ హీరో సుమన్‌కు కాంతారావు శత జయంతి పురస్కారం

ఒకప్పుడు హీరోగా రాణించిన సుమన్. అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. హీరో గా నిలదొక్కు కున్నా తర్వాత ఆయన సహాయ పాత్రల్లో చేయక తప్పలేదు

Suman: సీనియర్ హీరో సుమన్‌కు కాంతారావు శత జయంతి పురస్కారం
Suman
Rajeev Rayala
|

Updated on: Nov 20, 2022 | 7:08 AM

Share

అక్కినేని నాగేశ్వరరావు, ఎన్ టి రామారావు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు లో అగ్ర హీరో లుగా వెలుగుతున్న సమయం లోనే వారి ధీటుగా ప్రముఖ హీరో గా కాంతారావు నిలబడ్డారు అన్నారు ప్రముఖ నిర్మాత, దర్శకులు తమ్మా రెడ్డి భరద్వాజ. శనివారం, జూబ్లీ హిల్స్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో ప్రముఖ సంస్థ ఆకృతి ఆధ్వర్యంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. డిసెంబర్ నెలలో రవీంద్రభారతి వేదిక గా కాంతారావు శత జయంతి పురస్కార సభను నిర్వహిస్తున్నట్టు ఆయన వివరించారు.. ప్రసిద్ధ హీరో సుమన్ ఈ అవార్డు అందుకుంటారు అని ప్రకటించారు.

ఒకప్పుడు హీరోగా రాణించిన సుమన్. అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. హీరో గా నిలదొక్కు కున్నా తర్వాత ఆయన సహాయ పాత్రల్లో చేయక తప్పలేదు అన్నారు.. ఇక ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ, కాంతా రావు కత్తి యుద్దాలు తనకు చాలా ఇష్టమని చెబుతూ సుందరీ సుబ్బారావులో ఆయన కు మంచి వేషం ఇచ్చానని గుర్తు చేసుకున్నారు.

మరో దర్శకుడు పి. సి.ఆదిత్య మాట్లాడుతూ.. కాంతా రావు బయో పిక్ చేస్తున్నట్టు.. ఈ విషయమై వారి స్వగ్రామం కోదాడ మండలం గుది బండ వెళ్లి వచ్చినట్టు వవరించారు. ఆకృతి సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్య క్రమం లో ఫిక్కీ సి.ఎం. డీ అచ్యుత జగదీష్ చంద్ర, కాంతారావు కుమారుడు నటుడు రాజా తో పాటు పలువురు విలేకరులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.