Rishab Shetty: ‘ఇది నా పూర్వజన్మ సుకృతం’.. అయోధ్య రాముడి ఆహ్వానంపై రిషబ్ శెట్టి ఎమోషనల్
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగే ఈ మహా క్రతువును కళ్లారా వీక్షించేందుకు దేశ, విదేశాల నుంచి మహా సాధువులు, పండితులు తరలిరానున్నారు. అలాగే పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకలో భాగం కానున్నారు. సినిమా పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు కూడా ఇందులో ఉన్నారు.
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి . జనవరి 22న జరగనున్న ఈ మహాక్రతువు కోసం కోట్లాది మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగే ఈ మహా క్రతువును కళ్లారా వీక్షించేందుకు దేశ, విదేశాల నుంచి మహా సాధువులు, పండితులు తరలిరానున్నారు. అలాగే పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకలో భాగం కానున్నారు. సినిమా పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు కూడా ఇందులో ఉన్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులకు అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానాలు అందాయి . తాజాగా ప్రముఖ కన్నడ సినీ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టికి కూడా అయోధ్య నుంచి పిలుపు అందింది. ఈ మేరకు తనకు కూడా రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందిందంటూ మురిసిపోయాడీ పాన్ ఇండియా స్టార్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని షేర్ చేసుకున్నాడు రిషబ్ శెట్టి. ‘శ్రీరామ జయ రామ జయ జయ రామ. మేము చిన్నప్పటి నుంచి ఇళ్ళలో శ్రీరాముని ప్రవచనాలు, ఆయన ఆదర్శమైన జీవిత కథలను వింటూ పెరిగాం. ఇప్పుడు ఆ శ్రీరాముడే అయోధ్యకు రమ్మని మమ్మల్ని పిలిచాడు. ఇది నా పూర్వ జన్మ సుకృతం. ఈ చారిత్రాత్మక ఘట్టంలో పాల్గొనే అవకాశం వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది.శ్రీరాముడికి జయం కలుగుగాక, అయోధ్యకు జయం కలుగుగాక’ అని ట్వీట్ చేశాడు రిషబ్ శెట్టి. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘జై శ్రీరామ్’ అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
‘కాంతారా’ సినిమా విజయంతో రిషబ్ శెట్టి పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. నటుడిగా, దర్శకుడిగా జాతీయ స్థాయిలో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ‘కాంతారా: చాప్టర్ 1’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడీ పాన్ ఇండియా స్టార్. ఇంతలో అయోధ్యకు వెళ్లే అవకాశం రావడంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు రిషబ్. రిషబ్ తో పాటు చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ దంపతులు, మోహన్ బాబు, ప్రభాస్, రణబీర్ కపూర్, అమితాబ్ బచ్చన్, రిషబ్ శెట్టి, యష్, కంగనా రనౌత్, అలియా భట్, రజనీకాంత్, యష్, అక్షయ్ కుమార్, ఆయుష్మాన్ ఖురానా, రణదీప్ హుడా, అనుష్క శర్మ, అనుపమ్ ఖేర్, అజయ్ దేవగన్, మాధురీ దీక్షిత్, సంజయ్ లీలా బన్సాలీ, సన్నీడియోల్ తదితర ప్రముఖులకు కూడా అయోధ్య ఆహ్వానం అందింది.
I am deeply grateful for this opportunity, as my heart overflows with gratitude. ✨
ಈ ಅವಕಾಶಕ್ಕೆ ನಾನು ಸದಾ ಚಿರಋಣಿ..
ಜೈ ಶ್ರೀ ರಾಮ್ 🚩| Jai Shree Ram 🕉️ pic.twitter.com/4kfhsiZNVs
— Rishab Shetty (@shetty_rishab) January 19, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.