ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శనివారం (డిసెంబర్ 14) తెల్లవారుజామున చంచల్‌గూడ జైలు నుండి విడుదలయ్యారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి అతనికి సంఘీభావం తెలిపారు. అలాగే అతని యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈక్రమంలో ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర, లహరి మ్యూజిక్ ఏజెన్సీ యజమాని లహరి వేలు కూడా అల్లు అర్జున్ నివాసానికి వెళ్లి అల్లు అర్జున్‌ను కలిశారు. అల్లు అర్జున్ తో సరదాగా ముచ్చటించారు. ఉప్పి-అల్లు అర్జున్ ల భేటీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఉపేంద్ర తన ‘యూఐ’ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ లో ఉన్నాడు. ఈ సమయంలో అల్లు అర్జున్ నివాసానికి వెళ్లి అతనికి సంఘీభావం తెలిపాడు. ఉపేంద్ర, అల్లు అర్జున్ గతంలో ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ సినిమాలో నటించారు. ఇక అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్‌కి చెందిన గీతా ప్రొడక్షన్స్ ద్వారా ఉపేంద్ర కథానాయకుడిగా, దర్శకుడుగా తెరకెక్కిన ‘యుఐ’ని ఆంధ్రా, తెలంగాణల్లో పంపిణీ చేస్తున్నారు. ఉప్పి దర్శకత్వం వహించి, నటించిన ‘యూఐ’ చిత్రం 2050 సంవత్సరం నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమా పాటలు, ట్రైలర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం కన్నడలోనే కాకుండా తెలుగు, హిందీ తదితర భాషల్లో కూడా డిసెంబర్ 20న విడుదల కానుంది.
ఇక ఉదయం నుంచి అల్లు అర్జున్ ఇంటికి సెలబ్రిటీలు వస్తూనే ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, రానా దగ్గుబాటి, నాగ చైతన్య, కె. రాఘవేంద్రరావు, సురేష్ బాబు, శ్రీకాంత్, విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, ఆర్. నారాయణమూర్తి, దర్శకుడు సుకుమార్, బబీవీఎస్‌ఎన్ ప్రసాద్, హరీష్ శంకర్, బివిఎస్ రవి, సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ, పుష్ప నిర్మాతలు నవీన్, రవిశంకర్, కొరటాల శివ, దిల్ రాజు, వంశీ పైడిపల్లి, ఇప్పుడు ఉపేంద్ర వంటి వారంతా అల్లు అర్జున్ ఇంటికి వచ్చారు. బన్నీకి సంఘీభావం తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి.
Kannada legendary actor @nimmaupendra garu ♥️♥️
Support from all industries 🙏🙏🙏@alluarjun #Upendra #AlluArjun #NationWithAlluArjun pic.twitter.com/J9nrqBYDeg
— Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) December 14, 2024
UI meets AA
Real Star Upendra and Lahari Music’s #Velu share a memorable moment with Telugu Star Allu Arjun in Hyderabad during the Promotions of #UITheMovie. #Upendra #AlluArjun#Cineloka pic.twitter.com/9qmGRzIx7s
— Cineloka.co.in (@cineloka) December 14, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.