Kichcha Sudeep: హీరోయిన్‏గా ఎంట్రీ ఇస్తోన్న కిచ్చా సుదీప్ కూతురు.. నెట్టింట ఫాలోయింగ్ చూస్తే మెంటలెక్కపోద్ది..

కిచ్చా సుదీప్.. సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచంయ అవసరంలేని పేరు. కన్నడతోపాటు తెలుగు, తమిళంలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. దాదాపు 28 ఏళ్లుగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు సుదీప్ కూతురు సైతం హీరోయిన్‏గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్ నడుస్తుంది.

Kichcha Sudeep: హీరోయిన్‏గా ఎంట్రీ ఇస్తోన్న కిచ్చా సుదీప్ కూతురు.. నెట్టింట ఫాలోయింగ్ చూస్తే మెంటలెక్కపోద్ది..
Kichcha Sudeep

Updated on: Mar 15, 2025 | 11:53 AM

కన్నడ సినీపరిశ్రమలోని స్టార్ హీరోలలో కిచ్చా సుదీప్ ఒకరు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈగ సినిమాతో ఇటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుదీప్ మాట్లాడుతూ.. రిటైర్మెంట్ ప్లాన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే తన కూతురు సాన్వీ సుదీప్ హీరోయిన్‏గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్ నడుస్తుంది. దీంతో ఆయన అభిమానులు సాన్వీకి స్వాగతం పలుకుతున్నారు. కిచ్చా సుదీప్ నటించిన తాజా సినిమా మ్యా్క్స్ సూపర్ హిట్ అయింది. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ.. తాను ఇంకా అలసిపోలేదని.. అయితే ఏదో సమయంలో తాను నటన నుంచి రిటైర్ అయ్యే అవకాశం ఉందని అన్నారు. దీంతో సుదీప్ ఫ్యాన్స్ షాకయ్యారు.

ఇక ఇదే సమయంలో ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న సుదీప్ కూతురు సాన్వీ మాట్లాడుతూ.. సినీపరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు తనకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను ఇండస్ట్రీలోకి వచ్చేందుకు రెడీగా ఉన్నానని.. ఇప్పటికే హైదరాబాద్ లో 4 నెలల వర్క్ షాప్ లో శిక్షణ తీసుకున్నానని.. సొంతంగా అవకాశాలు సంపాదించుకోవాలని ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. తండ్రి పేరు చెప్పుకుంటే అవకాశాలు వస్తాయని.. కానీ అలా రావడం తనకు ఇష్టం లేదని.. నటిగా మారేందుకు తనకు మరింత సమయం కావాలని తెలిపింది.

మరోవైపు దర్శకత్వం, స్క్రిప్ట్ రైటింగ్ లోనూ రాణించే ప్రణాళికలు పెట్టుకున్నానని.. ఇండస్ట్రీలో ఉండే అన్ని విభాగాల్లోనూ ప్రయత్నించాలనుకుంటున్నట్లు చెప్పకొచ్చింది. తాను చాలా కాలంగా అధిక బరువుతో బాధపడుతున్నానని.. అందుకే నటిగా మారేందుకు మరింత సమయం పడుతుందని.. కెమెరా వెనకు జరిగే పనుల్లో ఉంటున్నట్లు తెలిపింది. హీరోయిన్ గానే కాకుండా ఎలాంటి పాత్ర వచ్చినా చేస్తానని తెలిపింది. దీంతో సాన్వీ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం సాన్వీకి సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది.

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..