తమిళ్ స్టార్ హీరో సూర్య కంగువ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సిరుత్తై శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో సూర్యతో పాటు దిశా పఠానీ,బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్ నిర్మించాయి. 10కి పైగా భాషల్లో, 3500కి పైగా థియేటర్లలో విడుదల కానుంది కంగువ. నవంబర్ 14న కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తెల్లవారుజామున 4 గంటలకు చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు మేకర్స్. ఇదిలా ఉంటే సూర్య ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
హీరో సూర్య , నటి జ్యోతిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కోలీవుడ్ లో మోస్ట్ లవబుల్ కపుల్ గా ఈ జంట పేరుతెచ్చుకున్నారు. సూర్య,జ్యోతికకు ఓ కుమారుడు, ఓ కూతురు ఉన్నారు. సూర్య, జ్యోతికల కూతురు, కొడుకుల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సూర్య, జ్యోతికల కూతురు పేరు దియా అలాగే కొడుకు వేరు దేవ్.
ఇటీవలే ఈ చిన్నారి ఇంటర్ లో టాప్ మర్క్స్ సాధించింది. తాజాగా దియా ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీపావళి సందర్భంగా సూర్య ఫ్యామిలి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోల్లో సూర్య కూతురు దియా హైలైట్ గా నిలిచింది. తల్లిని మించిన అందంతో దియా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ చిన్నదాని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దియా కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని సూర్య, జ్యోతిక ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. మరి ఈ చిన్నది సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.