Kangana Ranaut: ఆధ్యాత్మిక యాత్రలో కంగన.. విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి కేదార్‌నాథ్‌ ఆలయ దర్శనం

బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ కంగనా రనౌత్ ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌ను దర్శించుకుంది. ఆమె వెంట ఆర్‌ఆర్‌ఆర్‌ దర్శకుడు రాజమౌళి తండ్రి, ప్రముఖ విజయేంద్ర ప్రసాద్‌ కూడా ఉన్నారు. అలాగే కైలాసానంద మహారాజ్, ఎమ్మెల్యే ఉమేష్ కుమార్ కూడా కంగనా వెంట ఉన్నారు.

Kangana Ranaut: ఆధ్యాత్మిక యాత్రలో కంగన.. విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి కేదార్‌నాథ్‌ ఆలయ దర్శనం
Kangana Ranaut
Follow us

|

Updated on: May 25, 2023 | 1:22 PM

బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ కంగనా రనౌత్ ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌ను దర్శించుకుంది. ఆమె వెంట ఆర్‌ఆర్‌ఆర్‌ దర్శకుడు రాజమౌళి తండ్రి, ప్రముఖ విజయేంద్ర ప్రసాద్‌ కూడా ఉన్నారు. అలాగే కైలాసానంద మహారాజ్, ఎమ్మెల్యే ఉమేష్ కుమార్ కూడా కంగనా వెంట ఉన్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కంగనా కేదార్‌నాథ్‌ ఆలయాన్ని దర్శించుకుంది. అనంతరం తన ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన అనుభవాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. కాగా ఆలయ సందర్శన సమయంలో కంగనా సంప్రదాయ నీలిరంగు దుస్తులను ధరించింది. అలాగే గులాబీ రంగు బాంబర్ జాకెట్‌, నుదుటిపై గంధాన్ని పూసుకుని ఉన్న ఫొటోలను పోస్ట్ చేసిన కంగనా.. శివుడి దివ్యశక్తి ఉండే తీర్థయాత్రను సందర్శించడం ఎంత అదృష్టమో అని తన ఫొటోలకు క్యాప్షన్‌ ఇచ్చింది. ఈ ఫొటోలతో పాటు ఒక వీడియోను షేర్‌ చేసింది కంగనా. హెలికాప్టర్ నుంచి తీసిన ఈ వీడియోలో కేదార్‌నాథ్ దేవాలయం ఏరియల్ వ్యూను చూడొచ్చు. ఈ సందర్భంగా ‘హర హర మహాదేవ’ అని కంగనా పాడడం మనం చూడొచ్చు. ఎట్టకేలకు కైలాసనంద్ జీ మహారాజ్, విజయేంద్ర ప్రసాద్ లతో కలిసి కేదార్‌నాథ్ ను దర్శించానని, థ్యాంక్యూ ఉమేష్ భయ్యా అని వీడియోకు క్వాప్షన్ గా రాసుకొచ్చింది బాలీవుడ్ బ్యూటీ.

ఇక సినిమాల విషయానికొస్తే.. కంగనా గత సినిమా ధాకడ్‌ డిజాస్టర్‌గా నిలిచింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కనీస వసూళ్లు కూడా రాబట్టలేకపోయింది. ప్రస్తుతం ఆమె ఎమర్జెన్సీ అనే సినిమాలో నటిస్తోంది. అంతేకాదు ఇక ఈ సినిమాకు దర్శకత్వం, నిర్మాణం బాధ్యతలు కూడా కంగనానే తీసుకుంది. ఎమర్జెన్సీ సినిమా కోసం తన ఆస్తులు తాకట్టు పెట్టానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది కంగనా. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఎమర్జెన్సీ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకొంటోంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
నిడదవోలు ఎన్నికల బరిలో కస్తూరి సత్యప్రసాద్.. ప్రధాన పార్టీలకు దడ
నిడదవోలు ఎన్నికల బరిలో కస్తూరి సత్యప్రసాద్.. ప్రధాన పార్టీలకు దడ
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?