లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం.. అదిరిపోయిన ఇండియన్ 2 ట్రైలర్

 ‘భార‌తీయుడు 2’ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హ‌క్కుల‌ను శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థ‌లు ద‌క్కించుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ ప్రమోషనల్ ప్లానింగ్‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఈ క్ర‌మంలో ‘భారతీయుడు 2’ ట్రైల‌ర్‌ను తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేశారు..

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం.. అదిరిపోయిన ఇండియన్ 2 ట్రైలర్
Bharateeyudu 2
Follow us

|

Updated on: Jun 25, 2024 | 7:48 PM

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భార‌తీయుడు 2’ జీరో టాల‌రెన్స్ ట్యాగ్ లైన్‌ అనేది ట్యాగ్ లైన్. ‘భార‌తీయుడు 2’ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హ‌క్కుల‌ను శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థ‌లు ద‌క్కించుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ ప్రమోషనల్ ప్లానింగ్‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఈ క్ర‌మంలో ‘భారతీయుడు 2’ ట్రైల‌ర్‌ను తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేశారు..

ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే… ‘ఊరారా ఇది.. చ‌దువుకు త‌గ్గ జాబ్ లేదు.. జాబ్‌కు త‌గ్గ జీతం లేదు..క‌ట్టిన ట్యాక్స్ త‌గ్గిన‌ట్లు సౌక‌ర్యాలు లేవు..దొంగ‌లించేవాడు దొంగ‌లిస్తూనే ఉన్నాడు, త‌ప్పు చేస్తున్న‌వాడు త‌ప్పు చేస్తూనే ఉంటాడు’’ అని ఓ మ‌హిళ త‌న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేస్తుంది. మ‌రో వైపు హీరో సిద్ధార్థ్ ‘మ‌నం ఒక్కొక్క‌రినీ త‌ప్పు ప‌డుతూనే ఉంటాం. సిస్ట‌మ్ స‌రిగా లేదు. స‌రి చేయాల‌ని నోటికొచ్చిన‌ట్లు మాట్లాడుతుంటాం. కానీ దాన్ని స‌రి చేయ‌టానికి కొంచెం కూడా ప్ర‌య‌త్నించ‌టం లేదు’ త‌న బాధ‌ను వ్య‌క్తం చేస్తాడు.

కొంత మంది యువ‌త రోడ్ల పైకి వ‌చ్చి పోరాటం చేస్తుంటే పోలీసులు వారిపై కాల్పులు జ‌రుపుతారు. మ‌నం మొరిగే కుక్క‌లం మాత్ర‌మే.. అందుకే అరుస్తున్నా అని అందులో ఓ యువ‌కుడు త‌న ఆక్రోశాన్ని వెల్ల‌గ‌క్కుతాడు. ఇలా దేశ‌మంతా అల్ల‌ర్లతో అట్టుడికి పోతుంటుంది. ఆ స‌మ‌యంలో వీరంద‌రినీ చీల్చి చెండాడే ఓ వేట కుక్క రావాలి అని సిద్ధార్థ్ అంటాడు. అలా ఎవ‌రుంటార్రా అని ప్రియా భ‌వానీ శంక‌ర్ అంటే ఉండేవారు అని సిద్ధార్థ్ స‌మాధానం చెబుతాడు. ఆయ‌నే మ‌ళ్లీ రావాలి. ఓ త‌ప్పు చేస్తే దాన్నుంచి త‌ప్పించుకోలేమ‌నే భ‌యం రావాలి అంటూ సిద్ధార్థ్ చెబుతాడు. అప్పుడు సేనాప‌తి (క‌మ‌ల్ హాస‌న్)ని చూపించారు. పార్ట్ వ‌న్ భార‌తీయుడులో ఆయ‌నేం చేశాడ‌నే దాన్ని సింపుల్‌గా చూపించారు.

సేనాప‌తి త‌నొక ఫ్రీడ‌మ్ ఫైట‌ర్‌గా త‌న గురించి చెబుతూ ఇది రెండో స్వాతంత్ర్య పోరాటం. గాంధీజీ మార్గంలో మీరు.. నేతాజీ మార్గంలో నేను అనే ప‌వ‌ర్‌ఫుల్, ఎమోష‌న‌ల్ డైలాగ్స్ ‘భారతీయుడు 2’ ట్రైల‌ర్‌లో ఉన్నాయి. ఇక ట్రైల‌ర్‌లో సేనాప‌తి పాత్ర‌లో క‌మ‌ల్ హాస‌న్ యాక్ష‌న్ స‌న్నివేశాలు, వాటిని అత్య‌ద్భుతంగా తెర‌కెక్కించిన శంక‌ర్ మేకింగ్ స్టైల్ నెక్ట్స్ రేంజ్‌లో ఉన్నాయి. సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆస‌క్తిని ట్రైల‌ర్ రేకెత్తిస్తోంది.

‘భారతీయుడు 2’ ట్రైల‌ర్‌లో సేనాప‌తి పాత్ర‌తో పాటు డిఫ‌రెంట్ లుక్స్‌లో క‌మ‌ల్ హాస‌న్ త‌న‌దైన అభిన‌యాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఇక మ‌ర్మ‌క‌ళ‌తో విల‌న్స్ భ‌ర‌తం ప‌ట్ట‌డాన్ని కూడా ఈ సినిమాలో మ‌రింత విస్తృతంగా చూపించిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతుంది. ర‌వివ‌ర్మ‌న్ సినిమాటోగ్ర‌ఫీ, అనిరుద్ సంగీతం, నేప‌థ్య సంగీతం స‌న్నివేశాల‌ను మ‌రో లెవ‌ల్‌లో ఆవిష్క‌రించాయి. దీంతో సేనాపతిగా మరోసారి కమల్ హాసన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయబోతున్నారంటూ ట్రైలర్ చూస్తుంటేనే అర్థ‌మ‌వుతుంది. క‌మ‌ల్ హాస‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రంలో సిద్ధార్థ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, ఎస్‌.జె.సూర్య‌, బాబీ సింహ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ర‌వివ‌ర్మ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎ.శ్రీక‌ర ప్ర‌సాద్ ఎడిట‌ర్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా టి.ముత్తురాజ్ గా వ‌ర్క్ చేస్తున్నారు. బి.జ‌య‌మోహ‌న్‌, క‌బిల‌న్ వైర‌ముత్తు, ల‌క్ష్మీ శ‌ర‌వ‌ణ‌కుమార్‌ల‌తో క‌లిసి డైరెక్ట‌ర్ శంక‌ర్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ క‌ల‌యిక ప్రేక్ష‌కుల‌కు తిరుగులేని సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుంద‌న‌టంలో సందేహం లేదని ట్రైల‌ర్‌తో స్ప‌ష్ట‌మైంది. జూలై 12న‌ ఇండియన్ 2 పేరుతో త‌మిళంలో, భార‌తీయుడు 2 పేరుతో తెలుగు, హిందుస్థానీ పేరుతో హిందీలో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు..తెలుగు కుర్రాడికి స్థానం
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు..తెలుగు కుర్రాడికి స్థానం
ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ నబీల్.. ఫొటోస్
ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ నబీల్.. ఫొటోస్
సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?
సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను
BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను
సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!
రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!
ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..
ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..
విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు!
విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు!
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!