Kamal Haasan: సింగిల్‌ టేక్‌లో10 నిమిషాల నాన్‌స్టాప్ డైలాగ్‌.. 14 భాషల్లో చెప్పి అదరగొట్టిన కమల్‌!

Indian2: కమల్ హాసన్‌.. నటనకు పర్యాయపదంలా కనిపించే ఈ లెజెండరీ హీరో ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతుంటారు. క్యారక్టర్లకు తగ్గట్టుగా దశావతారాలు పోషించడం, సంభాషణలు పలకడంలో ఆయనకు ఆయనే సాటి.

Kamal Haasan: సింగిల్‌ టేక్‌లో10 నిమిషాల నాన్‌స్టాప్ డైలాగ్‌.. 14 భాషల్లో చెప్పి అదరగొట్టిన కమల్‌!
Kamal Haasan

Updated on: Sep 16, 2022 | 1:29 PM

Indian2: కమల్ హాసన్‌.. నటనకు పర్యాయపదంలా కనిపించే ఈ లెజెండరీ హీరో ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతుంటారు. క్యారక్టర్లకు తగ్గట్టుగా దశావతారాలు పోషించడం, సంభాషణలు పలకడంలో ఆయనకు ఆయనే సాటి. అందుకే అభిమానులు లోక నాయకుడు, యూనివర్సల్‌ హీరో అని కమల్‌ను ముద్దుగా పిల్చుకుంటారు. ఇటీవల విక్రమ్‌ సినిమాతో మరోసారి తన స్టామినాను నిరూపించుకున్నారీ కోలీవుడ్‌ హీరో. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో ఇండియన్‌2 సినిమా చేస్తున్నారు. గతంలో వచ్చిన సూపర్‌ హిట్‌ మూవీ భారతీయుడికి సీక్వెల్‌గా ఇది తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ క్రేజీ సీక్వెల్‌ గురించి కోలీవుడ్‌ మీడియాలో ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. సుమారు 10 నిమిషాల పవర్‌ఫుల్‌ డైలాగ్‌ని కమల్‌ సింగిల్‌ టేక్‌లో చెప్పారట. అది కూడా ఏకంగా 14 భాషల్లో. కమల్‌ నాన్‌స్టాప్‌గా చెప్పిన ఈ డైలాగ్‌కు చిత్ర బృందమంతా ఆశ్చర్యంలో మునిగిపోయారట. కాగా కథ డిమాండ్‌ మేరకు ఇందులో హీరో కమల్‌ 14 భాషల్లో మాట్లాడతారట. సినిమాకు ఈ డైలాగే మెయిన్ హైలైట్ గా నిలుస్తుందని చిత్రబృందం భావిస్తోంది.

కాగా ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ మెయిన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే రకుల్‌ ప్రీత్‌సింగ్‌, సిద్ధార్థ్‌, ప్రియాభవానీ శంకర్‌, బాబీ సింహా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కోలీవుడ్‌ రాక్‌స్టార్‌ అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూరుస్తుండగా ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తోంది. ఇప్పటికే పలు కారణాల వల్ల ఈ చిత్రం ఆలస్యమవుతూ వచ్చింది. దీంతో త్వరగా షూటింగ్‌ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే యోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..