Kalyaan Dhev: ‘పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ కావాలి.. మిస్సింగ్ మై డాటర్స్’.. వైరలవుతున్న కళ్యాణ్ దేవ్ పోస్ట్..

మెగా ఫ్యామిలీలో జరిగే ఏ పార్టీలోనూ కళ్యాణ్ దేవ్ కనిపించడం లేదు.అలాగే తన కూతుర్లను మిస్ అవుతున్నానంటూ కళ్యాణ్ పోస్ట్ చేయడం.. మరోవైపు శ్రీజ కూడా మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తుండడంతో ఈ రూమర్స్ నిజమనే టాక్ గట్టిగానే వినిపిస్తుంది. అయితే ఈ వార్తలపై ఇప్పటికీ వీరిద్దరూ నేరుగా స్పందించింది లేదు. కానీ నెట్టింట మాత్రం పరోక్షంగా విడిగా ఉంటున్నట్లు హింట్స్ ఇస్తున్నారు.

Kalyaan Dhev: పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ కావాలి.. మిస్సింగ్ మై డాటర్స్.. వైరలవుతున్న కళ్యాణ్ దేవ్ పోస్ట్..
Kalyaan Dhev

Edited By:

Updated on: May 18, 2023 | 6:55 PM

గత కొంతకాలంగా మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, అల్లుడు కళ్యాణ్ దేవ్ గురించి పలు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కొన్నినెలలుగా విడి విడిగా ఉంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం.. ఇద్దరూ కలిసున్న ఫోటోలను డిలీట్ చేయడంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా వీరు షేర్ చేసే పోస్టులు సైతం క్షణాల్లో వైరలవుతున్నాయి. మెగా ఫ్యామిలీలో జరిగే ఏ పార్టీలోనూ కళ్యాణ్ దేవ్ కనిపించడం లేదు.అలాగే తన కూతుర్లను మిస్ అవుతున్నానంటూ కళ్యాణ్ పోస్ట్ చేయడం.. మరోవైపు శ్రీజ కూడా మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తుండడంతో ఈ రూమర్స్ నిజమనే టాక్ గట్టిగానే వినిపిస్తుంది. అయితే ఈ వార్తలపై ఇప్పటికీ వీరిద్దరూ నేరుగా స్పందించింది లేదు. కానీ నెట్టింట మాత్రం పరోక్షంగా విడిగా ఉంటున్నట్లు హింట్స్ ఇస్తున్నారు.

తాజాగా కళ్యాణ్ దేవ్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. అందులో ఓ స్కూల్ పాప కల్చరల్ ఈవెంట్లో పాల్గొంటుంది. అందులో స్టేజ్ పై నిల్చున్న ఆ పాప.. తన పేరెంట్స్ ఎక్కడున్నారా అని వెతుక్కుంటుంది. వాళ్ల తల్లిదండ్రులను చూడగానే సంతోషంతో చాలా ఎగ్జయిట్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

Kalyan Dhev

ఈ వీడియోను షేర్ చేస్తూ.. పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ, సపోర్ట్ కావాలి. మిస్సింగ్ నవిష్క, నివిత్రి అంటూ ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. భార్యభర్తలు విడిపోయినా పిల్లలకు ఇద్దరి ప్రేమ దక్కాలి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.