Actress Meena: మీనాను రెండో పెళ్లి చేసుకోమన్న స్నేహితురాలు.. నటి సమాధానమేంటో తెలుసా?

|

Sep 17, 2023 | 4:17 PM

ప్రముఖ నటి మీనా భర్త విద్యాసాగర్‌ గతేడాది కన్నుమూసిన సంగతి తెలిసిందే. అంతకుముందు నుంచే అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన గత సంవత్సరం జూన్‌లో హఠాత్తుగా తుదిశ్వాస విడిచారు. భర్త మరణంతో మీనా బాగా కుంగిపోయింది. చాలా రోజుల పాటు బయటకు కూడా రాలేదు. అయితే కూతురుకు బంగారు భవిష్యత్‌ను అందించేందుకు జరిగిన విషాదాన్ని మర్చిపోయేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

Actress Meena: మీనాను రెండో పెళ్లి చేసుకోమన్న స్నేహితురాలు.. నటి సమాధానమేంటో తెలుసా?
Actress Meena
Follow us on

ప్రముఖ నటి మీనా భర్త విద్యాసాగర్‌ గతేడాది కన్నుమూసిన సంగతి తెలిసిందే. అంతకుముందు నుంచే అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన గత సంవత్సరం జూన్‌లో హఠాత్తుగా తుదిశ్వాస విడిచారు. భర్త మరణంతో మీనా బాగా కుంగిపోయింది. చాలా రోజుల పాటు బయటకు కూడా రాలేదు. అయితే కూతురుకు బంగారు భవిష్యత్‌ను అందించేందుకు జరిగిన విషాదాన్ని మర్చిపోయేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కూతురుకు అన్నీ తానై చూసుకుంటోంది. అదే క్రమంలో సినిమాలు కూడా చేస్తోంది. అయితే భర్త మరణం తర్వాత మీనా రెండో పెళ్లి చేసుకోనుందని వార్తలు గుప్పుమన్నాయి. చాలా సార్లు మీనా వీటిపై స్పందించింది. అవన్నీ వట్టి పుకార్లేనని కొట్టి పారేసింది. అయినా ఈ రూమర్లు ఆగడం లేదు. ఇటీవల మీనా కూతురు నైనిక కూడా ఈ పుకార్లపై స్పందిస్తూ ఎమోషనల్‌ అయ్యింది. ఒక సినిమా ఈవెంట్‌కు తల్లితో హాజరైన నైనిక.. ‘ మా అమ్మ కూడా మనిషే.. ఇలాంటి పుకార్లు, వార్తలు రావడం వలన ఆమె ఎంత బాధపడుతుందో మీకు తెలుసా’ అంటూ అందరిముందే కన్నీళ్లు పెట్టుకుంది. తాజాగా మీనా రెండో పెళ్లి విషయంపై ఆమె స్నేహితురాలు ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ కాలా స్పందించారు. ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె తనకు మీనాతోనూ, ఆమెకు కుటుంబ సభ్యులతోనూ మంచి అనుబంధం ఉందన్నారు.

‘నేను, మీనా స్నేహితులుగా కంటే అక్కాచెల్లెళ్లుగానే ఎక్కువ కలిసిపోయాం. తనకు ఏ కష్టమొచ్చినా వెంటనే నేను అక్కడ వాలిపోతాను. విద్యా సాగర్‌ ఆరోగ్యం బాగోలేనప్పుడు కూడా మూడు నెలల పాటు మీనా దగ్గరే ఉన్నాను. అయితే ఆమె జీవితంలో జరగకూడని విషాదం జరిగిపోయింది. భర్త చనిపోయాక మీనా బాగా కుంగిపోయింది. ఆమెను సాధారణ స్థితికి తీసుకురావడానికి చాలా సమయం పట్టింది. ఒకసారి రెండో పెళ్లి చేసుకోమని ఆమెకు సలహా ఇచ్చాను. కానీ ఆమె దానికి ఒప్పుకోలేదు. పైగా నామీదే కోప్పడింది. ఇలాంటి విషయాలు నీకు అనవసరం.. నా పెళ్లి గురించి అయితే ఇక నాతో మాట్లాడకు అని ఆగ్రహం వ్యక్తం చేసింది. నాకు కూతురు ఉంది. తన బాధ్యత నా భుజాలపై ఉంది. తనను చూసుకుంటూ ఉండిపోతానంది’ అని చెప్పుకొచ్చింది కాలా మాస్టర్‌. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ విషయంలో మీనాకు స్వేచ్ఛ ఇవ్వాలని, తన అభిప్రాయాలను గౌరవించాలని ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. గతేడాది మోహన్‌లాల్‌తో కలిసి బ్రో డాడీ సినిమాలో నటించింది మీనా. ఈ ఏడాది ఆమె నటించిన ఆర్గానిక్‌ మామ, హైబ్రిడ్‌ అల్లుడు మూవీకి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ప్రస్తుతం ఆమె రౌడీ బేబీ అనే సినిమాలో నటిస్తోందీ అందాల తార.

ఇవి కూడా చదవండి

అలనాటి అందాల తారలతో మీనా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.