AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందుకే విడాకులు.. షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.. ఫ్యాన్స్ అవాక్

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. తెలుగులో ఒకప్పుడు తోపు హీరోయిన్ గా రాణించింది కాజల్ అగర్వాల్. తెలుగులోనే కాదు తమిళ్ ల్లోనూ సినిమాలు చేసింది ఈ అమ్మడు. ఇక పెళ్లి తర్వాత ఈ అమ్మడు సెకండ్ ఇనింగ్స్ మొదలు పెట్టింది. టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అందుకే విడాకులు.. షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.. ఫ్యాన్స్ అవాక్
Kajal Agarwal
Rajeev Rayala
|

Updated on: Sep 21, 2026 | 4:38 PM

Share

డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియా మన రోజువారీ జీవితంలో భాగాంగా మారిపోయాయి. అయితే టెక్నాలజీ ఎంత దగ్గర చేస్తుందో.. అంతే దూరం కూడా చేస్తోందనే చర్చ ఎక్కువగా వినిపిస్తోంది. ముఖ్యంగా భార్యాభర్తలు, ప్రేమికులు, కుటుంబ సభ్యుల మధ్య విషయాలకు కూడా సోషల్ మీడియా అడ్డంగా మారిందని చాలా మంది వాపోతున్నారు. ఇదే అంశంపై నటి కాజల్ అగర్వాల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తాజాగా కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో చాలామంది జంటలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా తగినంత సమయం కేటాయించడం లేదని ఆమె అన్నారు. ఒకే చోట కూర్చున్నప్పటికీ ఫోన్లలో సోషల్ మీడియా స్క్రోలింగ్ చేయడం, మెసేజ్‌లు చూడటం, ఇతర డిజిటల్ కంటెంట్‌లో మునిగిపోవడం వల్ల నిజమైన మాటలు తగ్గిపోతోందని కాజల్ అగర్వాల్ పేర్కొంది. అలాగే ఇటీవల విడాకులు పెరిగిపోవడం పై కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ..

బిందాస్ మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మతిపోవాల్సిందే.. ఇప్పుడు ఎలా ఉందంటే

డిన్నర్‌కు కలిసి వెళ్లిన సమయంలో కూడా ఫోన్‌ను పక్కన పెట్టకుండా స్క్రీన్‌పైనే దృష్టి పెట్టడం వల్ల పార్ట్నర్స్ మధ్య ఉండాల్సిన అనుబంధం, పరస్పర అవగాహన దెబ్బతినే అవకాశం ఉందని కాజల్ అన్నారు. ఈ సందర్భంగా కాజల్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను కూడా పంచుకున్నారు. తన భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి ప్రతి వారం కొంత సమయాన్ని ప్రత్యేకంగా కేటాయించడానికి ప్రయత్నిస్తానని కాజల్ తెలిపింది.

ఆ డైరెక్టర్ అందరి ముందు లాగిపెట్టి కొట్టారు.. ఆ తర్వాత ఆ తప్పు చేయలేదు : బాలాదిత్య

ప్రత్యేకంగా డిన్నర్‌కి వెళ్లినప్పుడు ఫోన్లను పక్కన పెట్టి.. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, తమ రోజువారీ విషయాలను పంచుకోవడం, పరస్పరం వినడం వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పుకొచ్చింది. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా దంపతులు ఒకరి కోసం మరొకరు సమయం కేటాయించుకోవడం ముఖ్యమని కాజల్ చెప్పుకొచ్చింది. ప్రస్తుత జీవనశైలిలో టెక్నాలజీని పూర్తిగా దూరం పెట్టడం సాధ్యం కాకపోయినా.. వ్యక్తిగత సంబంధాల విషయంలో దానికి ఒక పరిమితి ఉండాలని కాజల్ చెప్పుకొచ్చింది. పార్ట్నర్ తో మాట్లాడేటప్పుడు ఫోన్‌ను పక్కన పెట్టడం, కలిసి భోజనం చేసే సమయంలో సోషల్ మీడియాకు దూరంగా ఉండటం, వారానికి కొంత సమయాన్ని కేవలం కుటుంబం లేదా పార్ట్నర్ కోసం కేటాయించడం వంటి చిన్న మార్పులు సంబంధాలను మరింత బలంగా చేస్తాయని కాజల్ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

ఓ సీన్ కోసం ఆ స్టార్ హీరో ఉతకాని, వాసనొస్తున్న సూట్‌ వేసుకున్నారు: దేవి ప్రసాద్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us