kajal Aggarwal: అక్కినేని హీరోతో తొలిసారి జతకట్టనున్న టాలీవుడ్ చందమామ… ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో..
kajal Aggarwal: 'చందమామ' సినిమాతో తెలుగు ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది అందాల తార కాజల్ అగర్వాల్. 14 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిందీ అమ్మడు. ఇక కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాకుండా తమిళ్, మలయాళం చిత్రాలతో పాటు బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటిందీ చిన్నది. ఇక..
kajal Aggarwal: ‘చందమామ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది అందాల తార కాజల్ అగర్వాల్. 14 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిందీ అమ్మడు. ఇక కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాకుండా తమిళ్, మలయాళం చిత్రాలతో పాటు బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటిందీ చిన్నది. ఇక తెలుగులో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన ఆడిపాడిందీ బ్యూటీ. వివాహం తర్వాత కూడా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. దూసుకెళుతోంది. ఇప్పటికే ఖైదీ నెంబర్ 150 చిత్రంలో మెగా స్టార్ చిరంజీవి సరసన నటించిన ఈ బ్యూటీ తాజాగా మరో టాలీవుడ్ సీనియర్ హీరో సరసన నటించే అవకాశం సొంతం చేసుకుంది. అతనేవరో కాదు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున. ‘గరుడవేగ’ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీని ఆకర్షించిన దర్శకుడు ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర్ సినిమాస్ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో నాగార్జున హీరోగా నటిస్తుండగా తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా చిత్ర యూనిట్ కాజల్‌ను ఓకే చేసింది. ఈ సినిమా గురించి కాజల్ మాట్లాడుతూ.. టాలీవుడ్‌లో తనకు ఇది అద్భుత సమయమని చెప్పుకొచ్చింది. తొలిసారి నాగార్జునతో నటిస్తున్నా.. ఇప్పటి వరకు పోషించని భిన్నమైన పాత్రలో నటిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చిందీ బ్యూటీ. ఇక ఈ సినిమా షూటింగ్‌ను గోవా, హైదరాబాద్, ఊటీ, లండన్‌లలో తెరకెక్కించనున్నారు. ఇదిలా ఉంటే కాజల్ గతంలో ‘ధడ’ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన విషయం తెలిసిందే. ఈ లెక్కన చూసుకుంటే తనయుడు, తండ్రితో ఆడిపాడనుందన్నమాట. ఇక కాజల్ మెగా స్టార్ చిరంజీవితో పాటు ఆయన తనయుడు రామ్ చరణ్ సరసన కూడా నటించిన విషయం తెలిసందే.