
స్టార్ హీరో సూర్య నటిస్తున్న చివరిగా నటించిన సినిమా కంగువ. సూర్య ఎన్నో డిఫరెంట్ మూవీస్ చేశాడు. ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేశాడు సూర్య. అలాగే ఇప్పుడు కంగువ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో సూర్య రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి మెప్పించాడు. దాదాపు 350 కోట్లకు పైగా ఖర్చుతో తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్ల వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది.ఈ సినిమా సౌండింగ్ విషయంలో చాలా విమర్శలు వచ్చాయి. సౌండ్ ఎక్కువగా ఉండటంతో సినిమా గందరగోళంగా ఉంది అని చాలా మంది విమర్శించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
దిశా పఠానీ, బాబీ డియోల్, కోవై సరళ, యోగి బాబు, రెడ్టిన్ కింగ్స్లీ, నటరాజన్ సుబ్రమణియన్, జగపతి బాబు, కెఎస్ రవికుమార్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించారు. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా భారీ వ్యయంతో సూర్య నటించిన కంగువ చిత్రాన్ని నిర్మించాయి. ఈ చిత్రాన్ని 10కి పైగా భాషల్లో 3డి టెక్నాలజీలో చిత్రీకరించారు. అయితే కంగువ సినిమాకు నెగిటివ్ రివ్యూలు రాయడం వల్లే ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిందని నటి , సూర్య సతీమణి జ్యోతిక అన్నారు.
తాజాగా మరోసారి జ్యోతిక కంగువ సినిమా గురించి మాట్లాడారు. కంగువ సినిమా పై వస్తున్న ట్రోల్స్ గురించి ఆమె మాట్లాడారు. తాజాగా ఓ టాక్ షోలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. సౌత్ నుంచి వచ్చిన ఎన్నో చెత్త సినిమాల కంటే కంగువ సినిమా బెటర్. ఎన్నో చెత్త సినిమాలు కమర్షియల్‌గా విజయం సాధించిన సందర్భాలు ఉన్నాయి. అంతే కాదు ఆ చెత్త సినిమాలు మంచి వసూళ్లు కూడా రాబట్టాయి. అయితే నా భర్త నటించిన ‘కంగువా’ చిత్రం వాటి కంటే నయం అని ఆమె అన్నారు. అయితే కంగువా సినిమా విషయంలో రివ్యూలు మాత్రం దారుణంగా రాశారు. ఏమాత్రం విచక్షణ లేకుండా రివ్యూలు రాశారని నాకు అనిపించింది అంటూ తన అభిప్రాయాన్ని తెలిపారు జ్యోతిక.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..