ఫ్యామిలీతో కలిసి హోలీ ఆడిన ఎన్టీఆర్.. పిక్ వైరల్
నిరంతరం షూటింగ్‌లతో బిజీగా ఉండే జూనియర్ ఎన్టీఆర్.. కాస్త సమయం దొరికితే ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తారు. అందులోనూ మంగళవారం హోలీ పండుగ సందర్భంగా.. భార్య లక్ష్మీ ప్రణతి, కుమారుడు అభయ్ రామ్‌లతో హాలీ సెలబ్రేషన్స్..
నిరంతరం షూటింగ్‌లతో బిజీగా ఉండే జూనియర్ ఎన్టీఆర్.. కాస్త సమయం దొరికితే ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తారు. అందులోనూ మంగళవారం హోలీ పండుగ సందర్భంగా.. భార్య లక్ష్మీ ప్రణతి, కుమారుడు అభయ్ రామ్‌లతో హాలీ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అంతేకాకుండా.. హోలీ చేసుకున్న ఫొటోలను కూడా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఫ్యామిలీ ఫొటోను.. షేర్ చేస్తూ.. హోలీ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశాడు. ఈ ఫొటోలో అందరూ నలుగురూ ఎంతో క్యూట్‌గా.. తెల్లటి దుస్తులతో ఉన్నారు. గతంలో కూడా హోలీ చేసుకున్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతుంది.
కాగా.. దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ హోలీని బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఈ ఏడాది కరోనా ఎఫెక్ట్‌తో చాలా మంది హోలీ ఆడటానికి ఇంట్రెస్ట్ చూపడంలేదు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా ఈ సంవత్సరం హోలీ చేసుకోవడం లేదు. ఆడిన కొంతమంది సెలబ్రెటీస్.. తమ ఫొటోలను సోషల్ మీడియాలో చేస్తున్నారు.
Wishing you all a very #HappyHoli pic.twitter.com/dTJ1V9iZlK
— Jr NTR (@tarak9999) March 10, 2020