Prashanth Neel: ప్రశాంత్ నీల్‏కు నాటుకోడి పులుసు పంపించిన ఎన్టీఆర్.. ఫోటోస్ వైరల్..

|

Jun 05, 2023 | 7:04 AM

ఇటీవల కేజీఎఫ్ 2 చిత్రంతో మరోసారి సెన్సెషన్ క్రియేట్ చేయడంతో.. ప్రశాంత్ నీల్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఆయన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక జూన్ 4న నీల్ పుట్టిన రోజు కావడంతో సలార్ సెట్ లో బర్త్ డే సెలబ్రెషన్స్ గ్రాండ్ గా చేశారు ప్రభాస్. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలయ్యాయి.

Prashanth Neel: ప్రశాంత్ నీల్‏కు నాటుకోడి పులుసు పంపించిన ఎన్టీఆర్.. ఫోటోస్ వైరల్..
Prashanth Neel, Ntr
Follow us on

కేజీఎఫ్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కన్నడ స్టార్ హీరో యశ్ ప్రధాన పాత్రలో ఆయన నీల్ తెరకెక్కించిన ఈ సినిమా రికార్డ్స్ స్థాయిలో వసూళ్లు రాబట్టింది. అంతేకాకుండా.. ఈ మూవీతో యష్, నీల్ ఇద్దరికీ పాన్ ఇండియా క్రేజ్ వచ్చేసింది. ఇక ఇటీవల కేజీఎఫ్ 2 చిత్రంతో మరోసారి సెన్సెషన్ క్రియేట్ చేయడంతో.. ప్రశాంత్ నీల్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఆయన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక జూన్ 4న నీల్ పుట్టిన రోజు కావడంతో సలార్ సెట్ లో బర్త్ డే సెలబ్రెషన్స్ గ్రాండ్ గా చేశారు ప్రభాస్. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలయ్యాయి.

మరోవైపు సోషల్ మీడియా వేదికగా ప్రశాంత్ నీల్ కు సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. నీల్ కు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ట్వీట్ చేశారు. హ్యాపీ బర్త్ డే బ్రదర్ ప్రశాంత్ నీల్..ఈ పుట్టినరోజు నీకు చాలా గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం నీల్ కు సర్ ప్రైజ్ గిఫ్ట్ పంపించారు.

Ntr, Prashanth Neel

ప్రశాంత్ నీల్ కు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ.. నాటు కోడి పులుసు పంపించారు తారక్. ఈ విషయాన్ని ప్రశాంత్ నీల్ వైఫ్ లిఖిత రెడ్డి తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేస్తూ.. థాంక్యూ అన్నయ్య అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.