Jr.NTR : కూటమి ఘనవిజయం పై తారక్ రియాక్షన్.. ఎన్టీఆర్ ఏమన్నారంటే

|

Jun 05, 2024 | 3:33 PM

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఊహించని విధంగా కూటమి విజయం సాధించడంతో నారా చంద్రబాబుకు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలుపుతున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన వారికి అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ప్రముఖులంతా చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ కు విషెస్ తెలుపుతున్నారు.

Jr.NTR : కూటమి ఘనవిజయం పై తారక్ రియాక్షన్.. ఎన్టీఆర్ ఏమన్నారంటే
Ntr
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో కూటమి అంఖండ విజయాన్ని అందుకుంది. భారీ మెజారిటీతో కూటమి అభ్యర్డులు ఘనవిజయాన్ని అందుకున్నారు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఊహించని విధంగా కూటమి విజయం సాధించడంతో నారా చంద్రబాబుకు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలుపుతున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన వారికి అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ప్రముఖులంతా చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ కు విషెస్ తెలుపుతున్నారు.

పవన్ కళ్యాణ్ విజయం పై చాలా మంది సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. చిరంజీవి ఫ్యామిలీతో పాటు టాలీవుడ్ నటీ నటులు కూడా పవన్ విజయాన్ని కొనియాడుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా చంద్రబాబు, పవన్ కు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ ట్వీట్ షేర్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతుంది.

“ప్రియమైన చంద్రబాబు మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు… మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన లోకేష్ కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, MPలుగా గెలిచిన భరత్ కి, పురందేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు. అలాగే అలాగే ఇంతటి ఘనవిజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు” అంటూ ట్వీట్ చేశారు తారక్.

ఎన్టీఆర్ ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్

ఎన్టీఆర్ ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.