AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్లైమాక్స్ ను చెక్కే పనిలో జక్కన్న.. షూటింగ్ గ్యాప్ లో రిలాక్స్ అవుతున్న చరణ్- తారక్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాకోసం టాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

క్లైమాక్స్ ను చెక్కే పనిలో జక్కన్న.. షూటింగ్ గ్యాప్ లో రిలాక్స్ అవుతున్న చరణ్- తారక్
Rajeev Rayala
|

Updated on: Feb 05, 2021 | 6:07 PM

Share

‘RRR’ Movie : యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాకోసం టాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమురం భీమ్ గా తారక్ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్లు సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి.

ఇక ఈ సినిమానుంచి ఎలాంటి అప్డేట్ లేదా ఫోటో రిలీజ్ అయితే అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం క్లైమాక్స్ చెక్కే పనిలో ఉన్నాడు జక్కన. షూట్ గ్యాప్ లో రెస్ట్ తీసుకుంటున్న చరణ్ -తారక్ ఫొటోలను రిలీజ్ చేసింది అర్ఆర్ఆర్ యూనిట్. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో వేసిన ప్రత్యేక సెట్లో ఈ షూటింగ్ కొనసాగుతోంది. ఇక ఇటీవల విడుదల తేదీని ప్రకటించిన నేపథ్యంలో నెమ్మదిగా ప్రమోషన్స్‌ను కూడా షురూ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. అలియా భట్‌, ఓలివియా మోరిస్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని, రే స్టీవెన్‌సన్‌, అలీ సన్‌ డూడీ కీలక పాత్ర పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఆగస్టు 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

మరో సర్‏ఫ్రైజ్ ఇచ్చిన ‘ఖిలాడీ’ టీం.. కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్.. వెల్‏కమ్ చెప్పిన చిత్రయూనిట్..

Follow Us
వాటర్ ట్యాంక్ నిర్లక్ష్యం ప్రాణాలకే ముప్పు.. 100మందికి అస్వస్థత!
వాటర్ ట్యాంక్ నిర్లక్ష్యం ప్రాణాలకే ముప్పు.. 100మందికి అస్వస్థత!
గర్భిణీ అని కూడా చూడకుండా.. అత్తింటి అరాచకం!
గర్భిణీ అని కూడా చూడకుండా.. అత్తింటి అరాచకం!
వర్షాకాలంలో మిద్దెపై ఇలా చేస్తే కూరగాయలు బుట్టలు బుట్టలు కాస్తాయ్
వర్షాకాలంలో మిద్దెపై ఇలా చేస్తే కూరగాయలు బుట్టలు బుట్టలు కాస్తాయ్
ఇలాంటి సిలిండర్‌ను అస్సలు తీసుకోకండి.. ఇది చాలా మందికి తెలియదు
ఇలాంటి సిలిండర్‌ను అస్సలు తీసుకోకండి.. ఇది చాలా మందికి తెలియదు
గురు గ్రహం అనుకూలత.. త్వరలో ఈ రాశుల వారికి వివాహ యోగం..!
గురు గ్రహం అనుకూలత.. త్వరలో ఈ రాశుల వారికి వివాహ యోగం..!
అయోధ్య విరాళాల కేసుపై చంపత్ రాయ్ స్పష్టత..!
అయోధ్య విరాళాల కేసుపై చంపత్ రాయ్ స్పష్టత..!
నా వల్ల కాదు బాబోయ్.. బిగ్ బాస్‏కు వెళ్లే ఓపిక నాకు లేదు..
నా వల్ల కాదు బాబోయ్.. బిగ్ బాస్‏కు వెళ్లే ఓపిక నాకు లేదు..
గుడ్ల కంటే ఎక్కువ ప్రొటీన్ కావాలా?శాకాహారులకు వరంఈ 5 సూపర్ ఫుడ్స్
గుడ్ల కంటే ఎక్కువ ప్రొటీన్ కావాలా?శాకాహారులకు వరంఈ 5 సూపర్ ఫుడ్స్
వరల్డ్ కప్ గెలిస్తే విన్నర్ కు ఎన్ని కోట్లు వస్తుందో తెలుసా ?
వరల్డ్ కప్ గెలిస్తే విన్నర్ కు ఎన్ని కోట్లు వస్తుందో తెలుసా ?
మరోసారి రెచ్చిపోయిన ర్యాప్ గ్యాంగ్.. తక్కువ ధరకే బంగారం అంటూ..
మరోసారి రెచ్చిపోయిన ర్యాప్ గ్యాంగ్.. తక్కువ ధరకే బంగారం అంటూ..