Janhvi Kapoor: ప్రియుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ.. బర్త్ డే గర్ల్ వెంట ఆ హీరోయిన్..

ప్రస్తుతం జాన్వీ దేవర సినిమాలో నటిస్తున్నారు. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈమాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఎన్టీఆర్ సరసన కనిపించనుంది జాన్వీ . ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది.అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబోలో రాబోతున్న ప్రాజెక్టులోనూ జాన్వీ ఎంపికైంది.

Janhvi Kapoor: ప్రియుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ.. బర్త్ డే గర్ల్ వెంట ఆ హీరోయిన్..
Janhvi Kapoor

Updated on: Mar 06, 2024 | 3:22 PM

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పుట్టిన రోజు నేడు (మార్చి 6). ఈ సందర్భంగా ఈ బ్యూటీకి సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు సినీ ప్రముఖులు, అభిమానులు. మరోవైపు జాన్వీ కొత్త సినిమా అప్డేట్స్ వరుసగా రివీల్ చేస్తున్నారు మేకర్స్. ఓవైపు నెట్టింట జాన్వీ పేరు మారుమోతుంది. ఇక ఇదే సమయంలో ఈ బ్యూటీ తన ప్రియుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరితోపాటు ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మహేశ్వరి సైతం వెంకన్నను దర్శించుకున్నారు. దివంగత నటి శ్రీదేవికి మహేశ్వరి చెల్లెలు అవుతుంది. అంటే జాన్వీ చిన్నమ్మ వరస అవుతుంది జాన్వీ. ఇదిలా ఉంటే… మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో జాన్వీ కొన్నేళ్లుగా ప్రేమలో ఉందనే ప్రచారం నడుస్తుంది. వీరిద్దరు కలిసి రెస్టారెంట్స్.. పార్టీస్.. మూవీ ఈవెంట్లలో కనిపిస్తున్నారు. ఇటీవల జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్లలోనూ జాన్వీ, శిఖర్ కలిసి హాజరయ్యారు.

ఇక ఇప్పుడు వీరిద్దరు కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే జాన్వీ, శిఖర్ ఇద్దరితో సోషల్ మీడియాలో సెన్సెషన్ ఓర్రీ కూడా కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ప్రస్తుతం జాన్వీ దేవర సినిమాలో నటిస్తున్నారు. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈమాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఎన్టీఆర్ సరసన కనిపించనుంది జాన్వీ . ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది.అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబోలో రాబోతున్న ప్రాజెక్టులోనూ జాన్వీ ఎంపికైంది. జాన్వీ పుట్టిన రోజు సందర్భంగా చరణ్ సినిమా అఫీషియల్ ప్రకటన వచ్చింది.

టాలీవుడ్ మాత్రమే కాకుండా కన్నడలోనూ జాన్వీ ఓ ప్రాజెక్ట్ చేయనుందని టాక్ వినిపిస్తుంది. కన్నడ సూపర్ స్టార్ శివన్న కొత్త సినిమాలో ఈబ్యూటీని ఎంపిక చేశారని తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.