RRR Janani Song: ఆర్ఆర్ఆర్ నుంచి జననీ సాంగ్.. ఈరోజు థియేటర్లలో.. లైవ్..

ఆర్ఆర్ఆర్ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్

RRR Janani Song: ఆర్ఆర్ఆర్ నుంచి జననీ సాంగ్.. ఈరోజు థియేటర్లలో.. లైవ్..

Updated on: Nov 25, 2021 | 10:38 AM

ఆర్ఆర్ఆర్ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. భారీ బడ్జెట్.. స్టార్ నటీనటులు.. బాలీవుడ్, హాలీవుడ్ ఫేమస్ యాక్టర్స్ నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక ఇటీవల విడుదలైన నాటు నాటు వీర నాటు సాంగ్ నెట్టింట్లో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకుపోతుంది.

తాజాగా ఈ సినిమా నుంచి జననీ సాంగ్ రిలీజ్ చేయనున్నట్లుగా చిత్రయూనిట్ రెండ్రోజుల క్రితం ప్రకటించింది. పెద్దన్న అద్భుతంగా కంపోజ్‌ చేసిన జనని పాట.. ఆర్‌ఆర్‌ఆర్‌ ఎమోషన్‌కు అద్దం పడుతుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ సోల్‌ ఆంథమ్‌ ను విడుదల చేస్తున్నారు మేకర్స్. కాసేపట్లో జననీ పాటను ఈరోజు కేవలం థియేటర్లో విడుదల చేయనున్నారు. కాగా ఈపాటను రేపు సోషల్ మీడియాలో అఫీషియల్‏గా విడుదల చేయనున్నారు. ఈ సాంగ్ రిలీజ్ కార్యక్రమాన్ని టీవీ9లో ప్రత్యేక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు.

Also Read: Shahid Kapoor: సినిమా కోసం బిచ్చగాడిలా ప్రతి ఒక్కరిని అడుక్కున్నాను.. సంచలన వ్యాఖ్యలు చేసిన షాహిద్ కపూర్..

Kamal Haasan Health Update: కమల్ హాసన్ ఆరోగ్య పరిస్థితి పై స్పందించిన శ్రుతి హాసన్.. ఎలా ఉన్నారంటే..

Drishyam 2 Twitter Review: దృశ్యం 2 ట్విట్టర్ రివ్యూ.. ఊహించని ట్విస్టులతో అదిరిపోయిందంటున్న నెటిజన్స్..

Dance Choreographer: డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఆయన కొడుకుకు కూడా..