AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Singer Janaki: జానకమ్మ జీవితంలో ఇంత అందమైన ప్రేమకథ ఉందా?దిగ్గజ గాయని లైఫ్ లో ఇన్ని ట్విస్టులా?

లెజండరీ సింగర్ జానకమ్మ మరణంతో సంగీత ప్రియులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆమె పాటలను గుర్తు చేసుకుంటూ ఆమెకు నివాళి అర్పిస్తున్నారు. కాగా జానకమ్మది ప్రేమ వివాహమని చాలా మందికి తెలియదు. ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఆమె తన ప్రేమకథ గురించి ఇలా చెప్పుకొచ్చారు.

Singer Janaki: జానకమ్మ జీవితంలో ఇంత అందమైన ప్రేమకథ ఉందా?దిగ్గజ గాయని లైఫ్ లో ఇన్ని ట్విస్టులా?
Legendary Singer Janaki
Basha Shek
|

Updated on: Jul 12, 2026 | 1:29 PM

Share

వేలాది పాటలకు తన మధురమైన గొంతుతో ప్రాణం పోశారు జానకమ్మ. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ గొప్ప గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఏడు దశాబ్దాలకు పైగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు అనేక భారతీయ, విదేశీ భాషల్లో నూ పాటలు పాడిన జానకమ్మ (88) శనివారం (జులై 11) కన్నుమూశారు. కాగా జానకమ్మ గాన ప్రస్థానం గురించి అందరికీ తెలుసు. అయితే ఆమె జీవితంలోనూ ఓ అందమైన ప్రేమకథ ఉందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఓ ఇంటర్వ్యూలో సింగర్ సునీత ‘మీది లవ్ మ్యారేజా’ అని జానకమ్మను అడిగింది. దీనికి లెజెండరీ సింగర్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ‘ మాది ప్రేమ వివాహమే. నేను హైదరాబాద్ లో మా మామయ్య చంద్రశేఖర్ దగ్గర ఉండేదాన్ని. ఆయన మేకప్ మార్చుకునే విరామ సమయంలో ప్రేక్షకులను అలరించేందుకు లతా మంగేష్కర్ పాటలు పాడేదాన్ని. ఒక రోజు చంద్రశేఖర్ జేబులో నుంచి మా ఆయన ( రామ్ ప్రసాద్) ఫొటో కింద పడింది. ఆ ఫొటోను ఎవరికీ తెలియకుండా తీసుకుని దాచుకున్నాను. అలా ఫొటో చూసి ఆయనను లవ్ చేశాను. మా ఇద్దరి ఏదో తెలియని అనుబంధం ఉన్నట్లు అనిపించింది. కొన్ని రోజుల తర్వాత స్వయంగా మా ఆయనే వచ్చి నన్ను కలిశారు. మా మావయ్య ఆయనకు నన్ను పరిచయం చేశారు. ఆ తర్వాత నేను పాటలు పాడతానని తెలిసి ‘ఈ అమ్మాయి నాటకాల్లో పాటలు పాడటానికే పరిమితం కాకూడదు. సినిమా రంగంలో అవకాశాలు కల్పించాలి. భవిష్యత్తులో దేశం మొత్తం గర్వపడే గాయని అవుతుంది’ అని చెప్పారు. ఆయనకు నా ప్రతి పాటంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా రసిక బలం సాంగ్ అంటే తెగ వినేసేవారు’

‘నేను రికార్డింగ్‌కు వెళ్తే ఒక్కరోజు కూడా నన్ను ఒంటరిగా పంపే వారు కాదు. ఆయన తన జీవితమంతా నా కోసమే ధారపోశారు. ఆయన ప్రోత్సాహం లేకపోతే నేను ఈ స్థాయికి చేరుకునేదాన్ని కాదు. ఈరోజు కూడా ఆయన నా ఆలోచనల్లో నాతోనే ఉన్నారు ‘ అని చెప్పుకొచ్చారు జానకమ్మ. రామ్‌ప్రసాద్- జానకమ్మలది ప్రేమ వివాహం. 1959లో కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహ వేడుక జరిగింది. వీరికి మురళీ కృష్ణ అనే కుమారుడు ఉన్నారు. కాగా 1997లో రామ్ ప్రసాద్ గుండెపోటుతో కన్నుమూశారు. ఇక ఈ ఏడాది జనవరిలో కుమారుడు మురళీ కృష్ణ కన్నుమూశాడు. ఇప్పుడు జానకమ్మ గారు కూడ వారి దగ్గరికే వెళ్లిపోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కోహ్లీ రికార్డ్ బ్రేక్.. బట్లర్ నెక్ట్స్ టార్గెట్ రోహిత్..
కోహ్లీ రికార్డ్ బ్రేక్.. బట్లర్ నెక్ట్స్ టార్గెట్ రోహిత్..
కేవలం 2-3 గంటల్లోనే పాలు తోడుకోవాలంటే ఇలా చేయండి..
కేవలం 2-3 గంటల్లోనే పాలు తోడుకోవాలంటే ఇలా చేయండి..
మాట్లాడటంలో ఇబ్బంది, చేతులు బలహీనంగా మారుతున్నాయా? అలసత్వం వద్దు
మాట్లాడటంలో ఇబ్బంది, చేతులు బలహీనంగా మారుతున్నాయా? అలసత్వం వద్దు
ఒక్కడే కూర్చుని కన్నీళ్లు పెట్టిన వైభవ్.. బుడ్డోడిని ఇలా చూస్తే..
ఒక్కడే కూర్చుని కన్నీళ్లు పెట్టిన వైభవ్.. బుడ్డోడిని ఇలా చూస్తే..
20ఏళ్ల పెద్ద హీరోని పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చిన కుర్ర హీరోయిన్
20ఏళ్ల పెద్ద హీరోని పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చిన కుర్ర హీరోయిన్
చికెన్ vs చేపలు.. వర్షాకాలంలో ఏది తింటే ఆరోగ్యానికి మంచిది..?
చికెన్ vs చేపలు.. వర్షాకాలంలో ఏది తింటే ఆరోగ్యానికి మంచిది..?
దిగ్గజ గాయని జానకమ్మ జీవితంలో ఇంత అందమైన ప్రేమకథ ఉందా?
దిగ్గజ గాయని జానకమ్మ జీవితంలో ఇంత అందమైన ప్రేమకథ ఉందా?
కరివేపాకు గుబురుగా పెరగడం లేదా? తోటమాలి చెప్పే 2 సూపర్‌ ట్రిక్స్‌
కరివేపాకు గుబురుగా పెరగడం లేదా? తోటమాలి చెప్పే 2 సూపర్‌ ట్రిక్స్‌
చిరాకు, నీరసం తగ్గి.. రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే..
చిరాకు, నీరసం తగ్గి.. రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే..
ఈ అట్టర్ ఫ్లాప్ టీంతో టీ20 ప్రపంచకప్ 2028కు వెళ్తారా..?
ఈ అట్టర్ ఫ్లాప్ టీంతో టీ20 ప్రపంచకప్ 2028కు వెళ్తారా..?