Jailer: రజనీకాంత్‌ ‘జైలర్‌’ సినిమాలో శివన్న మాస్‌ పెర్ఫామెన్స్‌.. ప్రశంసలతో పాటు కానుకల వెల్లువ

|

Aug 13, 2023 | 7:52 AM

సినిమా హిట్ అయితే అందులో నటించిన హీరో, దర్శకుడు, హీరోయిన్ కి అభినందనలు చెప్పడం మామూలే. ప్రశంసలు, బహుమతులు కూడా వారికే వస్తాయి. అయితే సినిమాలో క్యామియో రోల్ చేసిన నటుడికి బహుమతులు ఇచ్చి, చీర్స్ ఇచ్చి అభినందించడం చాలా అరుదు. కమల్ హాసన్ నటించిన 'విక్రమ్' చిత్రంలో సూర్య పోషించిన రోలెక్స్‌ పాత్రకు పెద్ద ఎత్తున ప్రశంసలు లభించాయి. ఇప్పుడు రజనీకాంత్ నటించిన 'జైలర్'లో శివ రాజ్‌కుమార్ అతిధి పాత్రకు కూడా అలాంటి ప్రశంసలే వస్తు్న్నాయి. 'జైలర్’ సినిమాలో శివరాజ్ కుమార్ నరసింహ అనే అతిథి పాత్రలో మెరిశారు.

Jailer: రజనీకాంత్‌ జైలర్‌ సినిమాలో శివన్న మాస్‌ పెర్ఫామెన్స్‌.. ప్రశంసలతో పాటు కానుకల వెల్లువ
Shiva Rajkumar
Follow us on

సినిమా హిట్ అయితే అందులో నటించిన హీరో, దర్శకుడు, హీరోయిన్ కి అభినందనలు చెప్పడం మామూలే. ప్రశంసలు, బహుమతులు కూడా వారికే వస్తాయి. అయితే సినిమాలో క్యామియో రోల్ చేసిన నటుడికి బహుమతులు ఇచ్చి, చీర్స్ ఇచ్చి అభినందించడం చాలా అరుదు. కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ చిత్రంలో సూర్య పోషించిన రోలెక్స్‌ పాత్రకు పెద్ద ఎత్తున ప్రశంసలు లభించాయి. ఇప్పుడు రజనీకాంత్ నటించిన ‘జైలర్’లో శివ రాజ్‌కుమార్ అతిధి పాత్రకు కూడా అలాంటి ప్రశంసలే వస్తు్న్నాయి. ‘జైలర్’ సినిమాలో శివరాజ్ కుమార్ నరసింహ అనే అతిథి పాత్రలో మెరిశారు. శివరాజ్ కుమార్ తెరపై కనిపించేది కొన్ని నిమిషాలే అయినా అతని మాస్ పెర్ఫార్మెన్స్ చూసి అందరూ ఫిదా అవుతున్నారు. తమిళ సినీ ప్రియులు కూడా శివన్న నటనకు ఫిదా అవుతున్నారు. కాగా ‘జైలర్’ సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే 100 కోట్ల కలెక్షన్లను దాటేసింది. ఈ ఆనందాన్ని చిత్రబృందం జరుపుకోకముందే కొందరు డిస్ట్రిబ్యూటర్లు సంబరాలు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా సినిమాలో అతిథి పాత్రలో కనిపించిన శివరాజ్ కుమార్‌ని కలిసి బహుమతులు ఇచ్చారు.
‘జైలర్’ చిత్రాన్ని కర్ణాటకలో పంపిణీ చేసిన జయన్న, వెంకటేష్‌లు శనివారం (ఆగస్టు 12) శివరాజ్‌కుమార్‌ను కలిశారు. శివన్నను శాలువాతో సత్కరించి, వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చారు. ‘జైలర్’ సినిమా కర్ణాటకలో మంచి వసూళ్లు సాధిస్తోందని తమ ఆనందాన్ని పంచుకున్నారు.

ఆ సీన్లు అదుర్స్ అంటోన్న ఆడియెన్స్

‘జైలర్’ సినిమాలో శివరాజ్ కుమార్ మాత్రమే కాదు, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ జాకీష్రాఫ్, తెలుగు కమెడియన్ సునీల్ కూడా అతిథి పాత్రల్లో కనిపించారు. అయితే శివన్న పాత్ర బాగా ఎలివేట్‌ అయ్యింది. ముఖ్యంగా సినిమాలో శివన్న ఎంట్రీ సీన్, క్లైమాక్స్ సీన్స్‌ హైలెట్‌గా నిలిచాయి. ఈ సినిమాకు నెల్సన్‌ దర్శకత్వం వహించారు. రమ్యకృష్ణ, తమన్నా కీలక పాత్రలు పోషించారు. యంగ్‌ మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుధ్‌ మరోసారి తన బీజీఎంతో అదరగొట్టాడు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.