Rakesh-Sujatha: ఏడుకొండలవాడి సాక్షిగా ఏడడుగులు నడిచిన జబర్దస్త్ ప్రేమ జంట.. వేడుకగా రాకేశ్‌-సుజాతల వివాహం.. హాజరైన రోజా

|

Feb 25, 2023 | 5:51 AM

ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో రాకేశ్‌- సుజాతలు ఏడడుగులు నడించారు. ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖా మంత్రి రోజా, సెల్వమణితో పాటు గెటప్‌ శ్రీను, యాంకర్‌ రవి పాటు పలువురు జ‌బ‌ర్ద‌స్ క‌మెడియ‌న్స్ ఈ వివాహ వేడుకకు హాజ‌రయ్యారు. నూతన దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు

Rakesh-Sujatha: ఏడుకొండలవాడి సాక్షిగా ఏడడుగులు నడిచిన జబర్దస్త్ ప్రేమ జంట.. వేడుకగా రాకేశ్‌-సుజాతల వివాహం.. హాజరైన రోజా
Rakesh, Sujatha
Follow us on

జబర్దస్త్‌ ప్రేమ పక్షులు రాకింగ్‌ రాకేశ్‌- జోర్దార్‌ సుజాతలు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. గత కొద్దికాలంగా ప్రేమలో ఉన్న వీరి వివాహం శుక్రవారం (ఫిబ్రవరి24) తిరుమల ఏడుకొండల వాడి సాక్షిగా అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో రాకేశ్‌- సుజాతలు ఏడడుగులు నడించారు. ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖా మంత్రి రోజా, సెల్వమణితో పాటు గెటప్‌ శ్రీను, యాంకర్‌ రవి పాటు పలువురు జ‌బ‌ర్ద‌స్త్  క‌మెడియ‌న్స్ ఈ వివాహ వేడుకకు హాజ‌రయ్యారు. నూతన దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం రాకేశ్‌-సుజాతల పెళ్లి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. పలువురు బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు ఈ కొత్త జంటకు విషెస్‌ చెబుతున్నారు.

టీవీ యాంకర్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన సుజాత తెలంగాన యాసలో మాట్లాడుతూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఆ తర్వాత బిగ్‌బాస్‌ షోలో పాల్గొని మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇక జబర్దస్త్ షోలోకి అడుగుపెట్టి రాకింగ్‌ రాకేశ్‌ టీంతో జతకట్టింది. ఈక్రమంలోనే ఇద్దరూ ప్రేమలో పడిపోయారు. పలు సందర్భాల్లో జబర్దస్త్ వేదికపైనే తమ ప్రేమ విషయాన్ని బహిర్గతం చేశారు. ఇక పెద్దల అనుమతి కూడా లభించడంతో జనవరి నెలలో గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఇప్పుడు పెళ్లిపీటలెక్కి దాంపత్య బంధంలోకి అడుగుపెట్టారు.

ఇవి కూడా చదవండి

Rakesh Sujatha

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..