
జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కమెడియన్స్ లో రచ్చ రవి ఒకరు. ఎన్నో రకాల స్కిట్స్ చేసి నవ్వులు పూయించాడు రవి. జబర్దస్త్ తో పాటు పలు టీవీ షోల్లోనూ కనిపించి మెప్పించాడు. ఇన్నాళ్లు బుల్లితెరపై సందడి చేసిన రచ్చ రవి.. ఇప్పుడు వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నాడు. తనదైన కామెడీ, పంచ్ డైలాగ్స్, నటనతో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు రచ్చ రవి. బలగం సినిమాలో ఆగుతావా రెండు నిమిషాలు అంటూ అతను చెప్పిన డైలాగ్ ఎంతగా పాపులర్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ప్రస్తుతం తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో బిజీ నటుడిగా మారుతున్నాడు. ఇటీవలే అఖండ 2, ఛాంపియన్ సినిమాలోనూ నటించాడు.
టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషిస్తూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో రచ్చ రవి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. చిరంజీవి గారికి వీరాభిమాని అయిన రచ్చ రవి, ఇంట్లో నుండి పారిపోయి సినిమా రంగంలోకి వచ్చానని తెలిపాడు. తన కెరీర్ తొలినాళ్లలో బ్రహ్మానందం గారిని కలిసిన సందర్భాలను గుర్తుచేసుకున్నారు. బ్రహ్మానందం గారు తన ఇంటిని వాస్తు ప్రకారం చూసి ఇప్పించారని, అది తన జీవితంలో ఒక మలుపు అని రవి పేర్కొన్నారు.
ఆర్థికంగా ఎప్పుడూ ఇబ్బందులు పడే స్థాయికి రాలేదని ఆయన అన్నాడు. జబర్దస్త్ నుండి బయటకు రావడానికి గల కారణాలను వివరిస్తూ, మల్లెమాలలో ఎవరూ శాశ్వతం కాదని, మల్లెమాల మాత్రమే శాశ్వతం అని రవి అన్నారు. టీమ్ లీడర్ గా వచ్చే రెమ్యూనరేషన్ సరిపోక, సినిమా వైపు వచ్చానని పరోక్షంగా తెలియజేశారు. మల్లెమాల డబ్బులతో కాకుండా, సినిమా డబ్బులతోనే ప్లాట్ కొనుగోలు చేశానని రచ్చ రవి స్పష్టం చేశారు. జీవితం అంటే ఏమిటో నేర్చుకున్నానని, తన ఆర్థిక మూలాలు చాలా చిన్నవని, తండ్రి చిన్న డ్రైవరు, తల్లి ఇంట్లో ఉంటుందని చెప్పుకొచ్చాడు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.