Sudheer Babu : అందుకే ‘బ్రహ్మాస్త్ర’ మూవీ ఆఫర్‌ను రిజక్ట్ చేశా.. సుధీర్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

సినిమాల విషయంలో యంగ్ హీరోలు చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. కథలను ఆచితూచి ఎంచుకుంటున్నారు.  కథలో బలముంటే చాలు సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. ఇదే పద్ధతి ఫాలో అవుతున్నాడు యంగ్ హీరో సుధీర్ బాబు

Sudheer Babu : అందుకే 'బ్రహ్మాస్త్ర' మూవీ ఆఫర్‌ను రిజక్ట్ చేశా.. సుధీర్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Sudheer Babu
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 16, 2022 | 6:06 PM

సినిమాల విషయంలో యంగ్ హీరోలు చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. కథలను ఆచితూచి ఎంచుకుంటున్నారు. కథలో బలముంటే చాలు సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. ఇదే పద్ధతి ఫాలో అవుతున్నాడు యంగ్ హీరో సుధీర్ బాబు(Sudheer Babu). తాజాగా ఈ కుర్ర హీరో నటించిన లేటెస్ట్ మూవీ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఈ సినిమా ఈ రోజు(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. ఇక ఈ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంట్రవ్యూలో హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ.. బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన బ్రహ్మాస్త్ర సినిమాలో తనకు ఛాన్స్ వచ్చిందని తెలిపారు.

రణబీర్ కపూర్, అలియా భట్ కలిసి నటించనిన బ్రహ్మాస్త్ర సినిమా ఇటీవల విడుదలై మంచి హిట్ అందుకుంది. ఈ సినిమాలో హీరో సుధీర్ బాబుకు ఛాన్స్ వచ్చిందట. అయితే అప్పటికే కమిట్ అయిన సినిమాలతో బిజీగా ఉండటంతో.. ఆ సినిమా ఛాన్స్‌ను సున్నితంగా తిరస్కరించారట సుధీర్ బాబు. అయితే బ్రహ్మాస్త్ర సినిమాలో ఏ పాత్రలో ఛాన్స్ వచ్చిందన్నది మాత్రం చెప్పలేదు సుధీర్ బాబు. తాను ఇతర ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటం వల్లే బ్రహ్మాస్త్ర సినిమాలో నటించలేకపోయానని, మారే ఇతర కారణాలు లేవని సుధీర్ బాబు క్లారిటీ  ఇచ్చారు. గతంలో టైగర్ ష్రాఫ్ నటించిన బాగి సినిమాలో సుధీర్ బాబు విలన్‌గా నటించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..