Sonal Chauhan : షూటింగ్‌లో గాయపడిన సోనాల్ చౌహన్.. కాలువిరిగిన కూడా..

సినిమా షూటింగ్స్ లో హీరో హీరోయిన్లు గాయపడటం మనం చూస్తూ ఉంటాం.. కొంతమంది ఆ గాయాలను కూడా లెక్క చేయకుండా సినిమాలకోసం కష్టపడుతూ ఉంటారు.

Sonal Chauhan : షూటింగ్‌లో గాయపడిన సోనాల్ చౌహన్.. కాలువిరిగిన కూడా..
Sonal Chauhan
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 16, 2022 | 7:46 PM

సినిమా షూటింగ్స్ లో హీరో హీరోయిన్లు గాయపడటం మనం చూస్తూ ఉంటాం.. కొంతమంది ఆ గాయాలను కూడా లెక్క చేయకుండా సినిమాలకోసం కష్టపడుతూ ఉంటారు. తాజాగా ఈ అమ్మడు కూడా అదే చేసింది కాలు విరిగినా కూడా ఏమాత్రం లెక్క చేయకుండా యాక్షన్ సీన్స్ చేసి అందరిని షాక్ కు గురించి చేసింది. ఇంతకు ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు.. సోనాల్ చౌహన్(Sonal Chauhan ). మామూలుగానే హీరోయిన్స్ చాలా సున్నితంగా ఉంటారు. అలాంటి ముద్దుగుమ్మలు కష్టపడి యాక్షన్ సీన్ చూస్తుంటేనే చూడాలంటే బాధగా ఉంటుంది. అలాంటి ఇలా కళ్ళు చేతులు విరగ్గొట్టుకుంటే ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి.. ఇప్పుడు సోనాల్ ను చూసి ఫ్యాన్ అలానే ఫీల్ అవుతున్నారు. సోనాల్ ప్రస్తుతం నాగార్జున హీరోగా తెరకెక్కుతోన్న ఘోస్ట్ మూవీలో హీరోయిన్ గా చేస్తోంది.

యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ షూటింగ్‌లో భాగంగా యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అయితే షూటింగ్ సమయంలో సోనాల్ చౌహన్ గాయపడినట్టు తెలుస్తోంది. ఒక హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాల కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో సోనాల్ కాలు విరిగిందని తెలుస్తోంది.. దాంతో ఆరు నుండి ఎనిమిది వారాల విశ్రాంతి తప్పనిసరిగా కావాల్సిందే అంటూ వైద్యులు సూచించారు. కనీసం నడవడానికి కూడా వీలు లేదు అని వైద్యులు అన్నారట. అయితే అవేమి పట్టించుకోకుండా వెంటనే సోనాల్ ఘోస్ట్ సినిమా యాక్షన్ సన్నివేశాలకు కాలుకి కట్టుతోనే ప్రాక్టీస్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి
Theghost

Theghost

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..