Akkineni Amala : “ఈ సినిమాలో ఉన్న బ్యూటీ అదే”.. అక్కినేని అమల ఇంట్రెస్టింగ్ కామెంట్స్

వెర్సటైల్ హీరో శర్వానంద్ నటించిన తాజా చిత్రం ఒకే ఒక జీవితం. శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమల అక్కినేని కీలక పాత్రలో నటించారు.

Akkineni Amala : ఈ సినిమాలో ఉన్న బ్యూటీ అదే.. అక్కినేని అమల ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Amala Akkineni
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 16, 2022 | 7:58 PM

వెర్సటైల్ హీరో శర్వానంద్ నటించిన తాజా చిత్రం ఒకే ఒక జీవితం. శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమల అక్కినేని కీలక పాత్రలో నటించారు. విభిన్నమైన కథాంశాలతో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో అమల అక్కినేని(Akkineni Amala) మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అమల మాట్లాడుతూ.. ఒక నటిగా ప్రేక్షకులకు నచ్చడం కంటే గొప్ప విషయం ఏముటుంది. ప్రేక్షకులకు నచ్చే పాత్రలు చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా వుంటాను. అయితే ఇలాంటి పాత్రలు చేయడం సవాల్ తో కూడుకున్నది అన్నారు.

లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ తర్వాత రెండు మలయాళం, మూడు హిందీ సినిమాలు, ఒక వెబ్ సిరిస్ చేశాను. ప్రతి భాషలో ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. కానీ తెలుగులో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ తర్వాత ఇదే. అయితే గత ఐదేళ్ళుగా అన్నపూర్ణ ఫిల్మ్ అండ్ మీడియా నేనే చూసుకుంటున్నాను. వందలమంది విద్యార్ధుల భవిష్యత్ భాద్యత నాపై వుంది. ఈ భాద్యతని పక్కని పెట్టి నటనలో బిజీగా వుండటం కష్టం. అయితే నా మనసుకు హత్తుకునే కథ విన్నపుడు, ఆ పాత్రకి నేను కరెక్ట్ అనిపిస్తే మాత్రం తప్పకుండా చేస్తాను. ఒకే ఒక జీవితం అలా మనసుకు నచ్చిన కథే. ఒక నిజాయితీతో తీసిన సినిమా ప్రేక్షకులకు ఎప్పుడూ నచ్చుతుంది. ఒకే ఒక జీవితం మరోసారి దాన్ని రుజువుచేసింది అన్నారు. ‘ఒకే ఒక జీవితం’ హృదయాన్ని హత్తుకునే సినిమా అని నాగార్జున గారిని ముందే ప్రిపేర్ చేశాను. ఈ సినిమా చూశాక హార్ట్ ఓపెన్ అవుతుందని చెప్పాను. నాగార్జున గారికి వారి అమ్మగారు అన్నపూర్ణమ్మ గారు గుర్తుకు వచ్చారు. నిజంగా అది గ్రేట్ ఫీలింగ్. ఈ సినిమా చూసిన ప్రతిఒక్కరికి వారి మనసులకు దగ్గరరైనవారు గుర్తుకు వస్తారు. ‘ఒకే ఒక జీవితం’లోని బ్యూటీ అదే అన్నారు అమల.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి