Thaman: బోయపాటి- రామ్ పోతినేని సినిమాకు తమన్ అందుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

|

Oct 09, 2022 | 6:45 PM

ఆ తర్వాత వరుస సినిమాలతో ఫుల్ జోరు తో దూసుకుపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు తమన్. కేవలం తెలుగులోనే కాదు తమిళ్ లోనూ సినిమాలకు సంగీతం అందిస్తున్నారు తమన్

Thaman: బోయపాటి- రామ్ పోతినేని సినిమాకు తమన్ అందుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
Thaman
Follow us on

టాలీవుడ్ లో ప్రస్తుత ఎక్కువగా వినిపిస్తోన్న మ్యూజిక్ డైరెక్టర్ పేరు అంటే టక్కున చెప్పే పేరు తమన్. కిక్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన తమన్. ఆ తర్వాత వరుస సినిమాలతో ఫుల్ జోరుతో దూసుకుపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు తమన్. కేవలం తెలుగులోనే కాదు తమిళ్ లోనూ సినిమాలకు సంగీతం అందిస్తున్నారు తమన్. చిన్న చిన్న హీరోలతో పాటు స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేసి ఆకట్టుకుంటున్నారు. తాజాగా తమన్ అలవైకుంఠపురం లో సినిమాకు గాను బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్నారు. ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ఈసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాకు సంగీతం అందించారు తమన్. అంతే కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- శంకర్ దర్శకత్వంలో రానున్న సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నారు తమన్.

ఇదిలా ఉంటే బోయపాటి దర్శకత్వంలో రామ్ పోతినేని సినిమా చేస్తున్న విషయం  తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల ను ఎంపిక చేశారు. ఇక ఇప్పుడుఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ను ఫిక్స్ చేశారు. గతంలో బోయపాటి దర్శకత్వంలో బాలయ్య నటించిన అఖండ సినిమాకు తమన్ సంగీతం అందించిన విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు మరో సారి బోయపాటి సినిమాకు పవర్ ఫుల్ మ్యూజిక్ అందించనున్నారు. అయితే ఈ సినిమాకు తమన్ అందుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా తమన్ ఏకంగా ఐదు కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీకి సైతం తమన్ ఇదే రేంజ్ లో రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారని టాక్. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.