‘ఇస్మార్ట్ శంకర్’ సీక్వెల్ కన్ఫామా..?

యంగ్‌ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ కెరీర్‌లో.. బాక్సాఫీస్‌ వద్ద బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిన సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. ఒకే దెబ్బకు మూడు పిట్టల సామెత మాదిరిగా.. ఒకే సినిమాతో.. హీరో రామ్, డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌, చార్మీ‌కి కూడా లక్ కలిసి వచ్చింది. ఈ సినిమా.. రామ్‌ మూవీ కెరీర్‌లో బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది. పక్కా మాస్ మసాలా కథతో రూపొందిన ఈ సినిమాను.. ప్రేక్షకులు సూపర్ డూపర్ హిట్ చేశారు. మొదట్లో […]

  • Tv9 Telugu
  • Publish Date - 12:27 pm, Sun, 10 November 19
'ఇస్మార్ట్ శంకర్' సీక్వెల్ కన్ఫామా..?

యంగ్‌ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ కెరీర్‌లో.. బాక్సాఫీస్‌ వద్ద బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిన సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. ఒకే దెబ్బకు మూడు పిట్టల సామెత మాదిరిగా.. ఒకే సినిమాతో.. హీరో రామ్, డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌, చార్మీ‌కి కూడా లక్ కలిసి వచ్చింది. ఈ సినిమా.. రామ్‌ మూవీ కెరీర్‌లో బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది. పక్కా మాస్ మసాలా కథతో రూపొందిన ఈ సినిమాను.. ప్రేక్షకులు సూపర్ డూపర్ హిట్ చేశారు. మొదట్లో మిక్సడ్ టాక్‌ను అందుకున్న ఈ చిత్రం.. క్రమంగా హిట్‌ను అందుకుంది. తాజాగా.. ఈ సినిమా సీక్వెల్‌కు సంబంధించిన ఓ వార్త బాగా.. హల్‌చల్ అవుతోంది. దీంతో.. ప్రేక్షకులు కూడా ఆ సినిమాపై ఇంట్రెస్టింగ్‌గా వెయిట్ చేస్తున్నారు.

తాజాగా.. ఓ ఇంగ్లీష్ పేపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ మాట్లాడుతూ.. ‘పూరీతో మరో సినిమా చేయడం కన్ఫామ్‌.. అది మరో కథ అయినా కావచ్చు.. లేక ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్ లేదా ప్రీక్వెల్ అయినా కావొచ్చు. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం చర్చల దశలో ఉంది. ఇంకా ఫైనల్‌ కాలేదు’.. అంటూ చెప్పాడు. అలాగే.. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా సీక్వెల్‌పై పూరీ కూడా స్పందించాడు. అందరూ పార్ట్‌ 2 ఎప్పుడని అడుగుతున్నారు.. ఇప్పటికే దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ చేశాను.. వీలైనంత త్వరలోనే స్టార్ట్ సినిమా తెర మీదకు ఎక్కుతుంది. ఇందుకోసం ‘డబుల్ ఇస్మార్ట్’ అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేసి పెట్టానని ఆయన చెప్పుకొచ్చాడు.

కాగా.. రామ్ ప్రస్తుతం ‘రెడ్’ సినిమా చేస్తున్నాడు. కిశోర్ తిరుమల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 16 నుంచి షూటింగ్ మొదలు కానుంది.