AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వంటలక్క కూతురికి బంపరాఫర్.. ఏకంగా…

స్టార్ మా ఛానెల్‌లో వచ్చే ‘కార్తీక దీపం’ సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో వంటలక్కగా కేరళకు చెందిన ప్రేమి విశ్వనాథ్ తెలుగు వారి అభిమానాన్ని చూరగొంది. ఇక ఇప్పుడున్న అన్ని ఛానెల్‌లోని సీరియల్స్ కంటే ఇదే టాప్‌లో ఉండటం కూడా విశేషం. అంతేకాదు ఈ సీరియల్ వచ్చినప్పుడు.. ఎవరి ఇంట్లోనైనా ఆ ఛానెల్ మారిస్తే చిన్నపాటి యుద్ధాలు కూడా జరుగుతాయని నెట్టింట కామెంట్లు వినిపిస్తుంటాయి. ఇదిలా ఉంటే.. ఈ సీరియల్‌లో వంటలక్క కుమార్తెలలో […]

వంటలక్క కూతురికి బంపరాఫర్.. ఏకంగా...
TV9 Telugu Digital Desk
|

Updated on: Nov 10, 2019 | 11:06 AM

Share

స్టార్ మా ఛానెల్‌లో వచ్చే ‘కార్తీక దీపం’ సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో వంటలక్కగా కేరళకు చెందిన ప్రేమి విశ్వనాథ్ తెలుగు వారి అభిమానాన్ని చూరగొంది. ఇక ఇప్పుడున్న అన్ని ఛానెల్‌లోని సీరియల్స్ కంటే ఇదే టాప్‌లో ఉండటం కూడా విశేషం. అంతేకాదు ఈ సీరియల్ వచ్చినప్పుడు.. ఎవరి ఇంట్లోనైనా ఆ ఛానెల్ మారిస్తే చిన్నపాటి యుద్ధాలు కూడా జరుగుతాయని నెట్టింట కామెంట్లు వినిపిస్తుంటాయి. ఇదిలా ఉంటే.. ఈ సీరియల్‌లో వంటలక్క కుమార్తెలలో ఒకరైన సౌర్య పాత్రలో బేబి క్రితిక నటిస్తోంది. తన తండ్రి కోసం ఆరాటపడే కుమార్తె పాత్రలో అద్భుతంగా నటిస్తూ ఆ చిన్నారి అందరినీ ఆకట్టుకుంటోంది. దీనికంటే ముందు కొన్ని సీరియల్స్, సినిమాల్లో క్రితిక కనిపించినప్పటికీ.. వాటన్నింటికంటే ‘కార్తీకదీపం’తోనే ఆమెకు మంచి పేరు వచ్చింది. కాగా ఈ చిన్నారికి ఇప్పుడు బంపరాఫర్ వచ్చింది.

ఏకంగా సూపర్‌స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న చిత్రంలో ఓ పాత్రలో నటిస్తోంది. మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరులో నటిస్తుండగా.. తాజాగా ఈ మూవీ యూనిట్ కేరళకు వెళ్లింది. అక్కడ టీమ్ తీసుకున్న గ్రూఫ్ ఫొటోలో క్రితిక కూడా ఉంది. ఆమెతో పాటు రాజేంద్రప్రసాద్ మనవరాలు(చిన్నప్పటి మహానటి) కూడా ఈ మూవీలో ఒక పాత్రలో కనిపిస్తోంది. ఈ చిత్రంలో ఆ చిన్నారి పాత్ర ఎంత ఉన్నా.. మహేష్ సినిమాలో ఛాన్స్ కొట్టడం అంటే ఒక రకంగా అది క్రితిక కెరీర్‌కు కొంతైనా ఉపయోగపడుతుందనడంలో ఎలాంటి సందేహం ఉండదు. మరి ఈ లెక్కన క్రితికకు కూడా భవిష్యత్‌లో మంచి ఆఫర్లు వస్తాయేమో చూడాలి.

Follow Us
ఇదెక్కడి విడ్డూరం.. పెంగ్విన్ లా నడిచిన మహిళ .కారణం ఏంటంటే!
ఇదెక్కడి విడ్డూరం.. పెంగ్విన్ లా నడిచిన మహిళ .కారణం ఏంటంటే!
అమరావతి ఏసీ బస్సులో బైర్లు కమ్మే సీన్.. ఆ రాత్రి ఏం జరిగిందంటే..
అమరావతి ఏసీ బస్సులో బైర్లు కమ్మే సీన్.. ఆ రాత్రి ఏం జరిగిందంటే..
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్.. కిలోమీటర్‌కు ఎంత ఖర్చు అవుతుందంటే..
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్.. కిలోమీటర్‌కు ఎంత ఖర్చు అవుతుందంటే..
ఇవెక్కడి హారర్ సిరీస్‌లు రా అయ్యా.! చూస్తే నిద్రపట్టదు
ఇవెక్కడి హారర్ సిరీస్‌లు రా అయ్యా.! చూస్తే నిద్రపట్టదు
నేపాల్‌కు మళ్లీ భారీ వరద ముప్పు.. సురక్షిత ప్రాంతాలకు ప్రజలు..
నేపాల్‌కు మళ్లీ భారీ వరద ముప్పు.. సురక్షిత ప్రాంతాలకు ప్రజలు..
'మల్లెపూల పల్లకి' పాటకు డ్యాన్స్‌ చేసిన జబర్దస్త్ వర్ష.. వీడియో
'మల్లెపూల పల్లకి' పాటకు డ్యాన్స్‌ చేసిన జబర్దస్త్ వర్ష.. వీడియో
చావునే చంపేసే పండు.. దెబ్బతిన్న కణాలను బాగుచేసే దివ్యౌషధం!
చావునే చంపేసే పండు.. దెబ్బతిన్న కణాలను బాగుచేసే దివ్యౌషధం!
రాళ్లు రప్పలు ఉన్నాయని ఆ భూమి కొనలేదు.. ఇప్పుడు వందలకోట్లు
రాళ్లు రప్పలు ఉన్నాయని ఆ భూమి కొనలేదు.. ఇప్పుడు వందలకోట్లు
రాఖీ సందర్భంగా అక్క లేదా చెల్లిపై ఇచ్చే డబ్బులపై ట్యాక్స్ ఉంటుందా
రాఖీ సందర్భంగా అక్క లేదా చెల్లిపై ఇచ్చే డబ్బులపై ట్యాక్స్ ఉంటుందా
'రాత్రికి రాత్రే IAS అయిన రైల్వే కూలి'.. ఇదీ శ్రీనాథ్ విజయగాథ!
'రాత్రికి రాత్రే IAS అయిన రైల్వే కూలి'.. ఇదీ శ్రీనాథ్ విజయగాథ!