AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: పొలిటికల్ స్టఫ్‌‌తో బాలయ్య నెక్స్ట్ సినిమాలు.. దర్శకులు ఎవరంటే

అందుకు ఆయన స్క్రిప్టులకు ఇద్దరు డైరక్టర్లు స్పెషల్‌ ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారు. గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ నందమూరి నటసింహం బాలయ్య సినిమా చేస్తున్నారంటే, అందులోనూ ఆ సినిమాలు ఎలక్షన్‌ సీజన్‌ని టార్గెట్ చేశాయంటే డైలాగులు ఎలా ఉండాలి?

Balakrishna: పొలిటికల్ స్టఫ్‌‌తో బాలయ్య నెక్స్ట్ సినిమాలు.. దర్శకులు ఎవరంటే
Balakrishna
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Jul 10, 2023 | 12:09 PM

Share

చూడూ ఒక వైపే చూడు అంటున్నారు బాలయ్య. అది నిన్నటి సినిమాలో డైలాగ్‌ కాదు. ఇప్పుడు సిట్చువేషన్‌కి తగ్గ డైలాగ్‌. ఇప్పుడున్న సీజన్‌లో ఎవరు తన సినిమాలు చూసినా ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు పొలిటికల్‌ కంటెంట్‌ కూడా ఉండేలా జాగ్రత్తపడుతున్నారు. అందుకు ఆయన స్క్రిప్టులకు ఇద్దరు డైరక్టర్లు స్పెషల్‌ ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారు. గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ నందమూరి నటసింహం బాలయ్య సినిమా చేస్తున్నారంటే, అందులోనూ ఆ సినిమాలు ఎలక్షన్‌ సీజన్‌ని టార్గెట్ చేశాయంటే డైలాగులు ఎలా ఉండాలి? పంచ్‌లు ఏ రేంజ్‌లో పేలాలి.. నందమూరి అభిమానుల్లో ఈ డిస్కషన్‌ భారీగా జరుగుతోంది.

నందమూరి బాలయ్య సినిమాకు బోయపాటి డైరక్షన్‌. అది కూడా పొలిటికల్‌గా హీట్‌ మీదున్న సీజన్‌. ఇంకేంటి బొమ్మ అదుర్స్ అంటారా? ఆల్రెడీ హ్యాట్రిక్‌ హిట్‌ క్రెడిట్‌ ఉంది ఈ కాంబోకి. నెక్స్ట్ చేయబోయే సినిమా కూడా అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండేలా ప్లానింగ్‌ జరుగుతోందట. పైగా పొలిటికల్‌ పంచ్‌లు ఫ్యాన్స్ కడుపు నింపేలా ఉంటాయన్నది టాక్‌.

వై ఒన్లీ బోయపాటి. నా సినిమాలోనూ రాజకీయాలకు సంబంధించిన స్టఫ్‌ ఉంటుందని అంటున్నారట బాబీ. బాలయ్యతో సినిమా అంటే ప్రేక్షకులు ఎలాంటి ఎలిమెంట్స్ కోరుకుంటారో నాకు తెలుసు. అందుకే ఆ కైండ్‌ స్టఫ్‌ని ఫస్ట్ నుంచి జాగ్రత్తగా యాడ్‌ చేసుకుంటున్నానంటున్నారు బాబీ.

ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్‌ అయిన వీరసింహారెడ్డిలోనూ పొలిటికల్‌ పంచ్‌లకు కొదవే లేదు. సెటైర్లు విన్నవారంతా బాలయ్య డైరక్ట్ అటాక్‌ చేశారనే అనుకున్నారు. ఎలక్షన్‌ హీట్‌ మొదలు కాకముందే ఆ రేంజ్‌లో డైలాగులు చెప్పారంటే, ఇప్పుడు అసలే తగ్గేదేలే అన్నట్టుంటారు నట సింహం. ఆయనకు తగ్గట్టే డైలాగులను దట్టిస్తున్నారట మేకర్స్. ఎట్‌ ప్రెజెంట్‌ సెట్స్ మీదున్న అనిల్‌ రావిపూడి సినిమా కూడా అందుకు అతీతం కాదంటున్నాయి సినీ సర్కిల్స్.