AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yellamma: దేవి శ్రీకి హీరోయిన్ దొరికేసింది.. ఎల్లమ్మలో ఈ యంగ్ హీరోయిన్ ఫిక్స్.?

బలగం సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ ను తన వైపు తిప్పుకున్నాడు దర్శకుడు వేణు ఎల్దండి. కమెడియన్ గా కెరీర్ ను ప్రారంభించిన వేణు ఎన్నో సినిమాల్లో నవ్వులు పూయించారు. అలాగే జబర్దస్త్ కామెడీ షోలోనూ ఎన్నో స్కిట్స్ చేసి ఆకట్టుకున్నాడు వేణు. ఇక దర్శకుడిగా మారి బలగం సినిమాతో పెద్ద హిట్ అందుకున్నాడు.

Yellamma: దేవి శ్రీకి హీరోయిన్ దొరికేసింది.. ఎల్లమ్మలో ఈ యంగ్ హీరోయిన్ ఫిక్స్.?
Yellamma
Rajeev Rayala
|

Updated on: Aug 29, 2026 | 3:02 PM

Share

తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన బలగం సినిమాతో ఒక్కసారిగా ప్రేక్షకుల మనసులు దోచేశాడు కమెడియన్ వేణు. కమెడియన్ గా ప్రస్థానం మొదలు పెట్టి సినిమాలు, టీవీ షోలు చేసి ఆ తర్వాత దర్శకుడిగా మారాడు. కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన వేణు, ఆతర్వాత కమెడియన్ గా రాణించాడు. సినిమాలతో పాటు జబర్దస్త్ లాంటి కామెడీ షోలో ఎన్నో స్కిట్స్ చేసి నవ్వులు పూయించాడు. వేణు దర్శకుడిగా మారి చేసిన మొదటి సినిమా బలగం ఎంత పెద్ద విజయం సాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు ఏకంగా నేషనల్ అవార్డు కూడా వచ్చింది. బలగం లాంటి సినిమా చేసిన తర్వాత వేణు గ్యాప్ ఇచ్చి ఇప్పుడు ఎల్లమ్మ సినిమాతో రాబోతున్నాడు.

ఇది కదా సినిమా అంటే..! 10ఏళ్లుగా ఓటీటీలో దూసుకుపోతున్న మూవీ.. ఇప్పటికీ రికార్డే

ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియో గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమాలో దేవికి జోడీగా నటించే హీరోయిన్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది. మొదటి సారి దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తున్నారు. ఆయన పక్కన ఎవరు సెట్ అవుతారా అన్న క్యూరియాసిటీ అందరిలోనూ మొదలైంది. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తుందని టాక్ వచ్చింది.. ఆ తర్వాత ఆమె కాదు కీర్తిసురేష్ నటిస్తుందని వార్తలు వచ్చాయి. ఆతర్వాత ఆమె కాదు మృణాల్ ఠాకూర్ ని వార్తలు వినిపించాయి. ఇక ఇప్పుడు ఓ యంగ్ హీరోయిన్ పేరు తెరమీదకు వచ్చింది.

ఇవి కూడా చదవండి

ఓయమ్మో..! ఓరినాయనో..!! ఇవెక్కడి హారర్ సిరీస్‌లు రా అయ్యా.! చూస్తే నిద్రపట్టదు

ఆహీరోయిన్ ఎవరో కాదు అనంతిక. ఈ అమ్మడు మ్యాడ్ సినిమాలో నటించి మెప్పించింది. ఆతర్వాత ఎనిమిది వసంతాలు అనే సినిమాలో నటించింది. ఇక ఇప్పుడు రోమాంచికం అనే సినిమా చేస్తుంది. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ చిన్నది. ఇప్పుడు ఎల్లమ్మ సినిమాకు సెలక్ట్ అయ్యిందని టాక్ వినిపిస్తుంది. ఇటీవలే టెస్ట్ కట్ కూడా జరిగిందని. ఆల్మోస్ట్ ఈ అమ్మడు హీరోయిన్ గా ఫిక్స్ అయ్యిందని అంటున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

10లక్షలకే ఇస్తా అన్నారు.. రాళ్లు రప్పలు ఉన్నాయని ఆ భూమి కొనలేదు.. ఇప్పుడు వందలకోట్లు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us