పవన్ కళ్యాణ్ ఓజీలో అకీరాతోపాటు ఆ మెగా హీరోలు కూడా..? ఫ్యాన్‌కు పూనకాలే

హరి హర వీరమల్లు తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన సినిమా ఓజీ. పవన్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ మూవీ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. సుజిత్ తెరకెక్కిస్తోన్న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైన్ లో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించింది. ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మీ, వెంకట్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ఓజీలో అకీరాతోపాటు ఆ మెగా హీరోలు కూడా..? ఫ్యాన్‌కు పూనకాలే
Og Movie

Updated on: Aug 27, 2025 | 11:41 AM

పవన్ కళ్యాణ్ నటిస్తున్న నయా మూవీ ఓజీ. ఇటీవలే హరిహరవీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు పవన్. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఓజీ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. అలాగే అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్, హరీశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను విడుదల చేసిన టీజర్‌ పవన్ ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది. ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా ప్రకటించడంతో ఇక పవన్ అభిమానుల ఆనందానికి హద్దుల్లేవు. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్  సాంగ్ విడుదల చేశారు.

డిప్రెషన్‌తో సూసైడ్ చేసుకోవాలనుకుంది.. కట్ చేస్తే ఇండస్ట్రీలో తోప్.. చేతినిండా సినిమాలు

థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కోసం పేక్షకులంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.. హరిహరవీరమల్లు సినిమా తర్వాత పవన్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ డిఫరెంట్ లుక్ లో ఓ సమురాయ్ లా కనిపించనున్నాడు. అలాగే ఈ మూవీలో పవన్ కు జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుంది. ఈ సినిమాతో పవన్ బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయం అంటున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే  ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఆయనకు 36.. ఆమెకు19.. కట్ చేస్తే 20ఏళ్లకే తల్లయ్యింది.. చేతులారా కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్

ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ కూడా నటిస్తున్నాడని అంటున్నారు. ఓజీలో పవన్ కళ్యాణ్ చిన్నప్పటి పాత్రలో అకీరా కనిపిస్తాడు అని టాక్. అంతే కాదు ఇప్పుడు మరో ఇద్దరు మెగా హీరోల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఇద్దరిలో ఒకరు గెస్ట్ రోల్ లో కనిపిస్తారని కూడా సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ కలిసి బ్రో అనే సినిమాలో నటించారు. ఇక ఇప్పుడు పవన్ సినిమాలో తేజ్ గెస్ట్ రోల్ లో నటిస్తున్నారు అని అంటున్నారు. మరి ఈవార్తల్లో వాస్తవమెంత అన్నది చూడలి.

ఇవి కూడా చదవండి

ఇదెక్కడి మాస్ రా మావ..! రామ్ చరణ్ పెద్దిలో ఫిల్మీ మోజీ.. థియేటర్స్ దుమ్ములేచిపోవాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.