Game Changer: మెగా పవర్ స్టార్ గేమ్ ఛేంజర్ సినిమా నుంచి క్రేజీ అప్డేట్.. అదేంటంటే
గేమ్ ఛేంజర్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా కావడంతో సినిమా పై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ కు గ్లోబల్ స్టార్ ఇమేజ్ వచ్చింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చాలా కాలంగా జరుగుతోంది. గేమ్ ఛేంజర్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా కావడంతో సినిమా పై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ కు గ్లోబల్ స్టార్ ఇమేజ్ వచ్చింది. దాంతో ఆయన ఇప్పుడు అని పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉంటే గేమ్ ఛేంజర్ సినిమా నుంచి అప్డేట్స్ కోసం అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని పోస్టర్స్ సినిమా పై హైప్ ను డబుల్ చేశాయి. ఇదిలా ఉంటే గేమ్ ఛేంజర్ సినిమానుంచి మొదటి సింగిల్ రిలీజ్ చేస్తున్నాం అని టీమ్ ఇప్పటికే అనౌన్స్ చేసింది. కానీ ఆ తర్వాత దాని గురించి ఊసే లేదు. దాంతో అభిమానులు కొంత నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గేమ్ ఛేంజర్ సినిమానుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది.
చరణ్ ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. శంకర్ సినిమా పూర్తయిన వెంటనే బుచ్చిబాబు సినిమాలో జాయిన్ కానున్నాడు చెర్రీ. అయితే శంకర్ సినిమా షూటింగ్ లో చరణ్ పాత్ర చిత్రీకరణ ఇంకా 60 రోజులు ఉందట. చకచకా చరణ్ కు సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేసి మిగిలింది తర్వాత షూట్ చేయాలని శంకర్ భావిస్తున్నాడట. ఈ క్రమంలో చరణ్ పార్ట్ మార్చ్ నాటికి పూర్తి చేయనున్నారట. తమన్ సంగీతం అందిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.
#GameChanger pic.twitter.com/UhrDpTrg9W
— Sri Venkateswara Creations (@SVC_official) November 11, 2023
గేమ్ చెంజర్
Here’s the first look of #GameChanger
Happy Birthday Megapower Star @AlwaysRamCharan💥@shankarshanmugh @advani_kiara @yoursanjali @DOP_Tirru @MusicThaman @artkolla @SVC_official #SVC50 #RC15 #HBDGlobalStarRamCharan pic.twitter.com/JpGohGhaeh
— Sri Venkateswara Creations (@SVC_official) March 27, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
