Oscars 2023: తెలుగు సినిమాకు బిగ్ షాక్.. ఆస్కార్ నుంచి ‘ఆర్ఆర్ఆర్’ ఔట్.. భారత్‌ నుంచి గుజరాతీ మూవీ!

ఇక ఆ సినిమాకు బదులుగా.. గుజరాతీ మూవీ 'చలో షో' ను.. ఇండియా నుంచి ఆస్కార్ కు ఎంపిక చేసింది. తాజాగా ఫిల్మ్ ఫెడరేషన్ సమావేశమై ఇదే నిర్ణయం తీసుకుంది.

Oscars 2023: తెలుగు సినిమాకు బిగ్ షాక్.. ఆస్కార్ నుంచి 'ఆర్ఆర్ఆర్' ఔట్.. భారత్‌ నుంచి గుజరాతీ మూవీ!
Rrr
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 20, 2022 | 7:19 PM

ఆర్ఆర్ఆర్ చిత్రానికి బిగ్ షాక్ తగిలింది. ఆస్కార్ బరిలోకి వెళ్లి అదరగొడుతుందన్న సినిమాకు భారత ప్రభుత్వం నుంచి చుక్కెదురైంది. ఇంటర్నేషల్ మీడియా మొదలుకుని.. నేషనల్ మీడియా వరకు వచ్చిన న్యూస్ తాజాగా అబద్దమైంది. అందరూ అనుకున్న ట్రిపుల్ ఆర్ చిత్రానికి బదులు.. ఓ గుజరాతీ మూవీ ఆస్కార్‌ కు వెళ్లనుంది. ఫిల్మ్ ఫెడరేషన్ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. హాలీవుడ్ మేకర్స్ మెప్పు పొందిన.. జక్కన మాగ్నమ్ ఓపెస్… ట్రిపుల్ ఆర్ మూవీని ఆస్కార్ బరిలో నిలిపేందుకు నిరాకరించింది ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఇక ఆ సినిమాకు బదులుగా.. గుజరాతీ మూవీ ‘చలో షో’ ను.. ఇండియా నుంచి ఆస్కార్ కు ఎంపిక చేసింది. తాజాగా ఫిల్మ్ ఫెడరేషన్ సమావేశమై ఇదే నిర్ణయం తీసుకుంది.

ఇక ఇండియా తరుపున ఆస్కార్ బరిలో ట్రిపుల్ ఆర్ తో పాటు.. కాశ్మీరీ ఫైల్స్ చిత్రం కూడా వెళుతుందని అందరూ అనుకున్నారు. కాని ఊహించని విధంగా.. గుజరాతీ సినిమా చలో షో తెరపైకి వచ్చి అందర్నీ షాక్ చేసింది. ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఇక చలో షో సినిమా విషయానికి వస్తే.. ఇంగ్లీష్‏లో లాస్ట్ ఫిల్మ్ షో పేరుతో డైరెక్టర్ పాన్ నలిన్ తెరకెక్కించిన ఈ సినిమా అక్టోబర్ 14న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ రాయ్ కపూర్ బ్యానర్ రాయ్ కపూర్ ఫిల్మ్స్, జుగాద్ మోషన్ పిక్చర్స్, మాన్సూన్ ఫిల్మ్స్, ఛెలో షో LLP, నిర్మించారు. ఇందులో మార్క్ డ్యూలే. భవిన్ రాబరి, భవేష్ శ్రీమాలి, రిచా మీనా, దిపెన్ రావల్, పరేష్ మెహతా ప్రధాన పాత్రలలో నటించారు. గతేడాది జూన్‏లో జరిగిన ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్‏లో ప్రారంభ సినిమాగా ఈ మూవీ ప్రపంచ ప్రీమియర్ ప్రదర్శించారు. గుజరాత్ గ్రామీణ ప్రాంతంలో చిన్నతనంలో సినిమాల పట్ల ఆకర్షితుడైన నళిన్ జ్ఞాపకాల ఆధారంగా ఈమూవీని తెరకెక్కించారు. స్పెయిన్‌లోని 66వ వల్లాడోలిడ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గోల్డెన్ స్పైక్‌తో సహా ఫెస్టివల్ రన్ సమయంలో ఈ సినిమా అనేక అవార్డులను గెలుచుకుంది. ఇక్కడ థియేటర్ రన్ సమయంలో కమర్షియల్ హిట్ అందుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..