SS Rajamouli: ‘ఆస్కార్ వచ్చినా.. నేను సినిమా తీసే విధానం మారదు’.. రాజమౌళి ఆసక్తికర కామెంట్స్..
ఈ మూవీ ప్రీమియర్ అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నలకు రాజమౌళి సమాధానాలు ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆస్కార్ అవార్డు వస్తే చాలా సంతోషమని.. కానీ ఆ అవార్డ్ తన పనిని.. కథను వివరించే విధానాన్ని మార్చదని తెలిపా
తెలుగు చిత్రపరిశ్రమలో ఇప్పటివరకు ప్లాప్ రుచి చూడని డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli). ఆయన తెరకెక్కించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద విజయాన్ని సాధించాయి. అంతేకాకుండా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టడమే కాకుండా.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు. బాహుబలి సినిమాతో సంచలనం సృష్టించిన రాజమౌళి.. ఇటీవల ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో మరోసారి పాన్ ఇండియా లెవల్లో సెన్సెషన్ క్రియేట్ చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో అజయ్ దేవగణ్, అలియా భట్ తెలుగు తెరకు పరిచయమయ్యారు. రూ. 400 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈసినిమా ఏకంగా రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తాజాగా ఈ చిత్రాన్ని ఐఎఫ్సీ సెంటర్లో ప్రదర్శించారు. ఈ మూవీ ప్రీమియర్ అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నలకు రాజమౌళి సమాధానాలు ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆస్కార్ అవార్డు వస్తే చాలా సంతోషమని.. కానీ ఆ అవార్డ్ తన పనిని.. కథను వివరించే విధానాన్ని మార్చదని తెలిపారు.
” ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డ్ అందుకున్నా.. లేకపోయినా.. నా తదుపరి సినిమా పై ఎలాంటి ప్రభావం చూపించదు. ఆస్కార్ రావడం వల్ల చిత్రపరిశ్రమకు.. దేశానికి మరింత ధైర్యాన్ని ఇస్తుంది. కానీ నేను సినిమా తీసే విధానం.. స్టోరీ వివరించే విధానంపై ఎలాంటి ప్రభావం చూపించదు. ఒక ఫిల్మ్ మేకర్ గా నన్ను నేను ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ చూసుకోవాలి. నేను కథ చెప్పే విధానాన్ని అప్డేట్ చేసుకోవాలి. నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. ఎలా కోరుకుంటున్నాను అనేది ఏం మారదు” అని అన్నారు రాజమౌళి.
ఆర్ఆర్ఆర్ అనేది కేవలం కల్పితకథ మాత్రమే అని సినిమా విడుదలకు ముందుగానే చెప్పాం. ఇది చరిత్ర పాఠం మాత్రం కాదు. ప్రతి ప్రేక్షకుడికి సినిమా అర్థమవుతుంది. ఒక బ్రిటిషర్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడంటే దాని అర్తం వారంతా విలన్స్ కాదు. నా హీరోలు భారతీయులంతే. భారతీయులందరూ హీరోలను అర్థం చేసుకుంటే చాలు. హీరో.. విలన్ ఎవరు అనేది ప్రేక్షకుడికి అర్థమైతే చాలు. కథ ఏంటీ అనేది ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చెప్పాలి అంతేకానీ ఇతర విషయాల గురించి అవసరం లేదు అంటూ చెప్పుకొచ్చారు రాజమౌళి.