Manmohan Singh Biopic OTT: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బయోపిక్.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే..
భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం సాయంత్రం ఆసుపత్రిలో చేరారు. నిన్న రాత్రి 9 గంటల సమయంలో మన్మోహన్ సింగ్ తుదిశ్వాస విడిచారు. మాజీ ప్రధాని మృతి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి, కేంద్రమంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు సంతాపం ప్రకటించారు.
భారత మాజీ ప్రధానమంత్రి, డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొన్నాళ్లు అనారోగ్య సమస్యలతో భాదపడుతున్న ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. మన దేశానికి ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా ఎన్నో సంవత్సరాలపాటు సేవలు అందించారు. దేశంలో అత్యధిక కాలంపాటు ప్రధానిగా సేవలు అందించిన వ్యక్తిగా నిలిచారు మన్మోహన్ సింగ్. 92 ఏళ్ల వయసులో డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ఈ సందర్భంగా ఆయన మృతిపట్ల దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ స్టార్స్ నివాళులర్పిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, అన్ని రాష్ట్రాల సీఎంలు మాజీ ప్రధాని మృతి పట్ల సంతాపం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన సినిమా గురించి తెలుసా.. ?
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా రూపొందించిన బయోపకి ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’. 2019 విడుదలైన ఈ సినిమా అనే వివాదాలను ఎదుర్కొని మరీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2018లో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఆ మరుసటి ఏడాది 2019 జనవరి 11న థియేటర్లలో రిలీజ్ చేశారు. భారత విధాన విశ్లేషకుడు సంజయ బారు అనుభవాలు, జ్ఞాపకాల ఆధారంగా రాసిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్: ది మేకింగ్ అండ్ అన్ మేకింగ్ ఆఫ్ మన్మోహన్ సింగ్’ పుస్తకంలోని పలు సంఘటలనలను తీసుకుని తెరకెక్కించారు. ఈ చిత్రానికి మయాంక్ తివారి కథ అందించగా.. రత్నాకర్ గుట్టే దర్శకత్వం వహించారు. ఇందులో మన్మోహన్ సింగ్ పాత్రను కార్తీకేయ 2 ఫేమ్, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ పోషించారు. ఇందులో తన నటనకు ప్రశంసలు అందుకున్నారు అనుపమ్ ఖేర్. ఈ చిత్రాన్ని రుద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై బోహ్ర బ్రదర్స్, పెన్ ఇండియా లిమిటెడ్ బ్యానర్ పై జయంతిలాల్ గదా నిర్మించారు.
ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సినిమా కేవలం ఇంగ్లీష్ సబ్ టైటిల్ తో హిందీ భాషలోనే స్ట్రీమింగ్ అవుతుంది. 13వ భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మన్మోహన్ సింగ్.. 2004 నుంచి 2014 మధ్యగల సంఘటనలను ఈ సినిమాలో చూపించారు. 2019 జనవరి 11న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఉరి ది సర్జికల్ స్టైక్ మూవీకి పోటీగా అదే రోజు థియేటర్లలో విడుదలైంది ది యాక్సిడెంటల్ ప్రైమ్ మిస్టర్ సినిమా. మొదటి రోజే ఈ చిత్రానికి రూ.4.5 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.