సినిమా చూడాలంటే కారుతో బిల్డింగ్ పైకి ఎక్కాల్సిందే.. రూఫ్ టాప్ డ్రైవ్ ఇన్ థియేటర్.. ఎక్కడోకాదు ఇండియాలోనే..
సినిమాలు చూసేందుకు మనందరం ఎంచుకునే ది బెస్ట్ ప్లేస్ థియేటర్లే!. ఈ మధ్య ఎదో ఓటీటీల హడావిడి నడుస్తుంది కానీ ఎక్కువ మనవాళ్ళు థియేటర్స్ లోనే సినిమా చూడటానికిఇష్టపడుతుంటారు..

సినిమాలు చూసేందుకు మనందరం ఎంచుకునే ది బెస్ట్ ప్లేస్ థియేటర్లే!. ఈ మధ్య ఎదో ఓటీటీల హడావిడి నడుస్తుంది కానీ ఎక్కువ మనవాళ్ళు థియేటర్స్ లోనే సినిమా చూడటానికిఇష్టపడుతుంటారు.. అదే కాస్త క్లాసీ టచ్ కావాలనుకునే వాళ్లు సినిమాలు చూసేందుకు ప్రిఫర్ చేసే సూపర్ ప్లేస్ మల్టీ ప్లెక్స్ ..! ఇది కరోనా ముందు వరకు..! ఓటీటీ యాప్‌లు సీనీ లవర్స్ ను అట్రాక్ట్ చేయనంత వరకు! అయితే పోయిన తమ బిజినెస్ ను మళ్లీ దక్కించుకునేందుకు ఫిల్మ్ లవర్స్‌కు కొత్త ఫీల్‌తో సినిమాను చూపించేందుకు PVR మల్టీప్లెక్స్ ఫారెన్‌లో ఉన్న ఓ థీమ్ థియేటర్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. అదే రూఫ్ టాప్ డ్రైవ్ ఇన్ థియేటర్.
ఓ బిల్డింగ్‌పైకి మన కార్‌తో డ్రైవ్ చేసుకుంటూ ఫ్యామిలీతో వెళ్లి సినిమా చూస్తూ ఎంజాయ్ చేసే కాన్సెప్టే రూఫ్ టాప్ డ్రైవ్ ఇన్ థియేటర్. ఫారెన్లో ఎప్పటి నుంచో ఉన్న ఈ కాన్సెప్ట్‌ను తాజాగా PVR, JIO ఇండియాలోని ముంబయ్‌లో లాంచ్ చేసింది. అయితే అలా లాంచ్ చేసిందో లేదో.. అప్పుడే ఈ కాన్సెప్ట్ అందర్నీ ఆకట్టుకుంటూ రూఫ్ టాప్ కెపాసిటీ ఫుల్ అయిపోయేలా చేసింది. ఐడియా అదిరింది కదూ.. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని ఇక్కడ చదవండి :