Kamal Haasan Birthday: విక్రమ్ వచ్చేశాడు.. యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టిన కమల్
లోకనాయకుడు కమల్ హాసన్ నటిస్తున్న తాజా చిత్రం 'విక్రమ్'. 'ఖైదీ', 'మాస్టర్' వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

లోకనాయకుడు కమల్ హాసన్ నటిస్తున్న తాజా చిత్రం ‘విక్రమ్’. ‘ఖైదీ’, ‘మాస్టర్’ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే కమల్ పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన టీజర్ కమల్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా ఆదివారం (నవంబర్7)న కమల్ హాసన్ పుట్టిన రోజు సందర్భంగా మరో సర్‌ప్రైజ్ ఇచ్చింది చిత్ర బృందం. ‘విక్రమ్ – ది ఫస్ట్ గ్లాన్స్’ పేరుతో మూవీ మేకర్స్ ఓ వీడియోను విడుదల చేశారు. ఆద్యంతం యాక్షన్ సీక్వెన్స్‌తో నిండి ఉన్న ఈ వీడియోలో కమల్ నటన ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. మొత్తం 48 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది.
సినిమాపై భారీ అంచనాలు.. ‘విశ్వరూపం-2’ విడుదలై మూడేళ్లు పూర్తవుతోంది. ఆతర్వాత కమల్ రాజకీయాల్లోకి వెళ్లడంతో సిల్వర్‌స్ర్కీన్‌పై కనిపించలేదు. ఆ మధ్యన ‘భారతీయుడు-2’ ప్రారంభించినా కొన్ని కారణాలతో మధ్యలోనే ఆగిపోయింది. దీంతో ‘విక్రమ్’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక కమల్ అభిమానులను అలరించేలా పూర్తి యాక్షన్ డ్రామగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు లోకేశ్. ఈ సినిమాలో కమల్‌తో పాటు విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read: