ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా చేసిన సౌత్ స్టార్స్.. IMDb లిస్ట్‌లో టాప్‌‌‌లో ఉన్న తారలు వీరే

ఈ ఏడాది మాత్రం సౌత్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా చేశారు మన స్టార్స్. తాజాగా 2022లో ఓవర్ ఆల్ ఇండియాలో పాపులర్ స్టార్స్ లిస్ట్ ను రిలీజ్ చేసింది IMDb ఈ లిస్ట్ లో దాదాపు అందరు మన సౌత్ స్టార్సే ఉండటం విశేషం.

ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా చేసిన సౌత్ స్టార్స్.. IMDb లిస్ట్‌లో టాప్‌‌‌లో ఉన్న తారలు వీరే
Imbd

Updated on: Dec 07, 2022 | 4:19 PM

సినిమా తరాలకు ఉండే క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మన దేశంలో ఎక్కువ క్రేజ్ ఉన్నది సినిమాలకు ఆ తర్వాత క్రికెట్ కు ఇక ప్రతి ఏడాది IMDb అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ స్టార్స్ జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది. అయితే ఈ ఏడాది మాత్రం సౌత్ ఫ్యాన్స్ కలర్ ఎగరేసుకునేలా చేశారు మన స్టార్స్. తాజాగా 2022లో ఓవర్ ఆల్ ఇండియాలో పాపులర్ స్టార్స్ లిస్ట్ ను రిలీజ్ చేసింది IMDb ఈ లిస్ట్ లో దాదాపు అందరు మన సౌత్ స్టార్సే ఉండటం విశేషం. టాప్ 10 స్టార్స్ ను లిస్ట్ అవుట్ చేయగా అందులో ఆరుగురు మన సౌత్ స్టార్స్ ఉన్నారు. కేవలం నలుగురు మాత్రమే బాలీవుడ్ స్టార్స్ ఉన్నారు. మరికొద్ది రోజుల్లో నూతన సంవత్సరానికి స్వాగతం పలకడానికి రెడీ అవుతున్నారు ప్రజలు. ఈ నేపథ్యంలో 2022లో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ తారల జాబితాను ఆవిష్కరించింది.

ఇక ఈ లిస్ట్ లో మన సౌత్ స్టార్స్, ధనుష్, రామ్ చరణ్, సమంత, ఎన్టీఆర్,అల్లు అర్జున్, కన్నడ స్టార్ యశ్ ఉన్నారు. అలాగే బాలీవుడ్ నుంచి అలియా భట్, ఐశ్వర్య రాయ్, హృతిక్ రోషన్, కియారా అద్వానీ ఉన్నారు. దాంతో ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. IMDb సోషల్ మీడియాలో ఈ లిస్ట్ డీటైల్స్ షేర్ చేయగా ఆ పోస్ట్ వైరల్ అయ్యింది.

ఇవి కూడా చదవండి

దాంతో సౌత్ ప్రేక్షకులు మన స్టార్స్ కాలర్ ఎగరేసేలా చేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇటీవల సౌత్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్న విషయం  తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ , పుష్ప, కేజీఎఫ్ లాంటి సినిమాలు సంచలన విజయాలను అందుకున్నాయి. అలాగే చాలా సినిమాలు పాన్ ఇండియా మూవీస్ గా రిలీజ్ అవుతూ సందడి చేస్తున్నాయి. మరో వైపు మన సినిమాలు బాలీవుడ్ లోనూ రికార్డు స్థాయిలో కలెక్షన్స్ సాధిస్తున్నాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ న్యూస్ కోసం..