అసలు సీక్రెట్ బయటపెట్టిన ఇలియానా..

గత కొంతకాలంగా తీవ్ర డిప్రెషన్ లో ఉంటున్న గోవా బ్యూటీ ఇలియానా తాజాగా మరోమారు వార్తల్లోకెక్కారు. గతంలో తాను చేసిన చిన్న చిన్న తప్పులకి గల అసలు కారణాన్ని బయటపెట్టింది.  ఇక వాటి వల్ల తన కెరీర్ లో అనేక మంచి అవకాశాలను పోగొట్టుకున్నానని, వాటితో తాను ఏం నష్టపోయానో చెప్పి అందరూ అవాక్కయ్యేలా చేసింది. ఇంతకాలం ఈ భామ ఖాన్ ల సరసన ఎందుకు నటించలేదో ..దానికి గల రహస్యం ఎంటో అభిమానులతో పంచుకున్నారు. గతంలో సల్మాన్ […]

అసలు సీక్రెట్ బయటపెట్టిన ఇలియానా..
Follow us
Pardhasaradhi Peri

| Edited By: Ravi Kiran

Updated on: Nov 29, 2019 | 5:26 PM

గత కొంతకాలంగా తీవ్ర డిప్రెషన్ లో ఉంటున్న గోవా బ్యూటీ ఇలియానా తాజాగా మరోమారు వార్తల్లోకెక్కారు. గతంలో తాను చేసిన చిన్న చిన్న తప్పులకి గల అసలు కారణాన్ని బయటపెట్టింది.  ఇక వాటి వల్ల తన కెరీర్ లో అనేక మంచి అవకాశాలను పోగొట్టుకున్నానని, వాటితో తాను ఏం నష్టపోయానో చెప్పి అందరూ అవాక్కయ్యేలా చేసింది. ఇంతకాలం ఈ భామ ఖాన్ ల సరసన ఎందుకు నటించలేదో ..దానికి గల రహస్యం ఎంటో అభిమానులతో పంచుకున్నారు. గతంలో సల్మాన్ ఖాన్ తనను పిలిచి మరీ అవకాశం ఇచ్చినా తాను కావాలనే అంగీకరించలేదట.. అయితే, దాని వెనక గల కారణాన్ని ఇలియానా తాజాగా బయటపెట్టింది.

సల్మాన్ నటించిన వాంటెడ్ – కిక్ చిత్రాల్లో ఫస్ట్ ఆప్షన్ ఇలియాననే. కానీ  అప్పుడు తాను ఎగ్జామ్స్ రాస్తోందట. కిక్ సినిమా సమయంలో వేరొక సినిమాకి కమిటైందట. దాంతో డేట్స్ కుదరలేదట.. అందుకే  రెండూ వదులుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది అమ్మడు. వాంటెడ్ పోకిరి కి రీమేక్ కాగా, కిక్ తెలుగు సినిమా కిక్ కి రీమేక్. ఈ రెండు తెలుగు సినిమాల్లోనూ ఇలియానా నటించింది. కానీ, హిందీలో మాత్రం ఛాన్స్ వచ్చినా  చేయలేకపోయానంటూ..అది నా బ్యాడ్ లక్ అంటూ వాపోయింది ఇలియానా. ప్రస్తుతం ఇలియానా నటించిన పాగల్ పంతి మూవీ  అభిమానుల ముందు ప్రదర్శనలో ఉంది.